Tiktok కంటే అద్భుతమైన వీడియోలను Instagram Reels లో చెయ్యొచ్చా? నిజమా?

Tiktok కంటే అద్భుతమైన వీడియోలను Instagram Reels లో చెయ్యొచ్చా? నిజమా?
HIGHLIGHTS

టిక్‌ టాక్ వంటి యాప్స్ ద్వారా పొందే ఎంజాయ్ మెంట్ మరియు క్రియేటివిటీని కోల్పోతున్న ఫీలింగ్ మీకు కలుగుతోందా?

ఇన్‌ స్టాగ్రామ్ మీ కోసం టిక్ టాక్ మాదిరిగా పనిచేసే, కొత్త ఫీచర్ Reel ఫీచరును తీసుకువచ్చిందని తెలుసా?

ఈ ఫీచర్ ద్వారా, మీరు Tiktok కంటే అద్భుతమైన షార్ట్ వీడియోలను క్రియేట్ చేసే అవకాశం వుంటుంది.

ఇటీవల, భారత ప్రభుత్వం సెక్యూరిటీ నియమాల కారణంగా ఇండియాలో 59 చైనీస్ యాప్స్ ని నిషేధించిచింది. వాటిలో ముఖ్యంగా, టిక్‌ టాక్ వంటి యాప్స్ ద్వారా పొందే ఎంజాయ్ మెంట్ మరియు క్రియేటివిటీని కోల్పోతున్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అలా అయితే, ఇన్‌ స్టాగ్రామ్ మీ కోసం టిక్ టాక్ మాదిరిగా పనిచేసే, కొత్త ఫీచర్ Reel ఫీచరును తీసుకువచ్చిందని తెలుసా?. ఈ ఫీచర్ ద్వారా,  మీరు Tiktok కంటే అద్భుతమైన షార్ట్ వీడియోలను క్రియేట్ చేసే అవకాశం వుంటుంది.  

అలాగే, భారతీయ తయారీదారులు తీసుకొచ్చిన Mitron, Chingari మొదలైన భారతీయ షార్ట్ వీడియో యాప్స్ కూడా మనం చూడవచ్చు. అయితే, ఈ ఫేస్ ‌బుక్ అధీకృత ఇన్ ‌స్టాగ్రామ్ ,‌ ఇప్పటికే మిలియన్ల మంది భారతదేశ వినియోగదారులు ఉన్నారు. కాబట్టి,  Reels చైనా షార్ట్ వీడియో యాప్ TikTok కి గట్టి పోటీని ఇవ్వగలదు. మరొక మంచి విషయం ఏమిటంటే, దీని కోసం ఎటువంటి ప్రత్యేకమైన యాప్ డౌన్లోడ్ చెయ్యాల్సిన అవసరం లేదు, మీ ఫోనులో వున్న Instagram లోనే ఈ ఫీచర్ వుంటుంది. అందుకే, దీని  గురించి తెలుసుకోవడం మంచింది.       

ఇప్పటి వరకూ మీరు టిక్ టాక్ లో వీడియోలను క్రియేట్ చేయడంలో  నిష్ట్నాతులై ఉండవచ్చు లేదా వీడియోలను ఎలా షేర్ చేయాలో, ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకోవాలి లేదా మంచి వీడియోలను సృజనాత్మకంగా ఇలా చూపించాలో వంటి విషయాలు మీకు తెలిసే ఉంటాయి. కానీ, కొత్తగా వచ్చిన ఈ Reels ఫీచర్ గురించి మీరు క్షుణ్ణముగా తెలుసుకోవడం మంచిది. ఇక్కడ మీరు అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.               

Instagram Reels ఎలా క్రియేట్ చెయ్యాలి?

ఇన్ ‌స్టాగ్రామ్ రీల్స్ ను క్రియేట్ చేయ్యడం చాలా సులభం, కానీ చాలా ప్రత్యేకమైన స్టెప్ రీల్స్ మీ ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో ఉండాలి. ఫేస్ ‌బుక్ ఈ రీల్స్ ఫీచర్ ‌ను ఇండియాలో విడుదల చేసింది. త్వరలోనే, వినియోగదారులందరికీ ఈ క్రొత్త ఫీచర్ లభిస్తుంది.

1. మొదట మీ ఇన్‌ స్టాగ్రామ్‌ను తెరవండి.

2. ఎగువ ఎడమవైపు కెమెరా చిహ్నంపై నొక్కండి.

3. దిగువన మీరు Live , Story  మరియు Reels  వంటి ఎంపికలను చూడవచ్చు. ఇక్కడ మీరు Reels పైన నొక్కండి.

4. ఇప్పుడు మీరు ఇన్‌ స్టాగ్రామ్ ‌లో Reels  తయారు చేయడం ప్రారంభించవచ్చు. అయితే,  వీడియో క్లిప్ యొక్క నిడివి కేవలం 15 సెకన్లు మాత్రమే ఉండాలి.

5. Instagram రీల్స్ రికార్డ్ చేయడానికి, పెద్ద వైట్ సర్కిల్ చిహ్నంపై నొక్కండి. ఇదే బటన్ తో రికార్డింగ్ ఆపవచ్చు.

Reels తో Effect వీడియోలను ఎలా క్రియేట్ చెయ్యాలి?

రికార్డింగ్ ప్రారంభించే ముందు మీరు ఎడమ వైపున ఉన్న చిహ్నాలకు కొన్ని Effect ను జోడించవచ్చు. వీడియో రికార్డింగ్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి ప్లే బటన్ వలె కనిపించే కుడి బాణం చిహ్నానికి వెళ్ళాలి. మీరు 0.3x వరకు స్లో మోషన్ ఇవ్వడం మరియు 3x వరకు స్పీడ్ చేయడం ద్వారా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. మీ వీడియోకు Effects జోడించడానికి, స్మైలీ బటన్‌పై నొక్కండి మరియు పెద్ద తెల్లని సర్కిల్‌ పై స్వైప్ చేయండి. ఇది మీకు అందుబాటులో ఉన్న అన్ని ఎఫెక్ట్ లను  చూపుతుంది మరియు మీకు నచ్చిన ఏ ఎఫెక్ట్ అయినా మీరు ఎంచుకోవచ్చు.

ఇన్ ‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డింగ్‌ మొదలవ్వడానికి ముందు మూడు సెకన్ల టైమర్‌ డిఫాల్ట్ గా సెట్ చేయబడుతుంది. అయితే, ఎడమ వైపున ఉన్న టైమర్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా, మీరు మీ క్లిప్ కోసం సమయాన్ని 0.1 నుండి 15 సెకన్ల వరకు ఎంచుకోవచ్చు మరియు సెట్ టైమర్‌ పై నొక్కండి. మీరు రికార్డింగ్ ప్రారంభించినప్పుడు మూడు సెకన్ల టైమర్ వీడియో మాత్రమే ముందుగా మీకు కనిపిస్తుంది.

చివరగా, మీరు ఎడమ వైపున ఉన్న సంగీత చిహ్నాన్ని నొక్కడం ద్వారా సంగీతాన్ని జోడించవచ్చు. ఒక మంచి విషయం ఏమిటంటే, మీరు Lyrics ని ఫోన్ స్క్రీన్ పైన  చూడవచ్చు మరియు మీరు వీడియోలో ఏ పాటను జోడించాలనుకుంటున్నారో చూసి ఎంచుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo