వాట్సాప్ లో అప్డేట్ చేసే స్టేటస్ 24 గంటలు మాత్రమే అందుబాటులో వుంటుందని, తరువత అది అదృశ్యమవుతుందని ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులకు తెలుసు. ఈ ఫీచర్ సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి వినియోగదారులు వారి స్నేహితులు మరియు కాంటాక్ట్ లిస్ట్ లోని వారితో వీడియోలు మరియు ఫోటోలను షేర్ చేసుకోవడానికి పునరుద్ధరించబడింది.
మీరు ఒక నిర్దిష్ట వినియోగదారు యొక్క వాట్సాప్ స్టేటస్ ని చెక్ చేసినప్పుడు, ఆ వినియోగదారులకు తెలియజేయబడుతుంది మరియు దాన్ని ఎవరు చెక్ చేశారో తెలుస్తుంది. కానీ, మీరు ఎవరిదైనా స్టేటస్ చెక్ చేసినా కూడా వారికీ తెలియకుండా చెక్ చేయడానికి ఒక మార్గం ఉంది.
ఈ ఎంపికను యాక్సెస్ చేయడానికి మీరు వాట్సాప్‌లోని ‘ Read Receipt’ ఫీచర్ ని ఉపయోగించవచ్చు. ఈ ‘‘ Read Receipt’’ ఫీచర్ ఏమిటంటే మీ మెసేజీని ఎవరు చదివారో మీకు చూపుతుంది. మీరు రెండు టిక్ మార్కులతో పంపిన సందేశాన్ని చూసినప్పుడు, సందేశం షేర్ చేయబడిందని అర్థం. టిక్ మార్కులు నీలం రంగులోకి మారినప్పుడు, మీరు పంపిన సందేశం అందుకున్నవారు చదివినట్లు అర్థం. ఇప్పుడు, మీరు ‘‘ Read Receipt’’ ఫీచర్ ఆపివేసినప్పుడు, మీరు చెక్ చేసిన స్టేటస్ గురించి తెలుసుకోనివ్వకుండా ఉంచే అదనపు ప్రయోజనం కూడా ఉంది.
అయితే, మీరు ఈ ఫీచర్ ఆపివేసినప్పుడు, మీ స్టేటస్ ని ఎవరు చెక్ చేశారో అనే విషయాన్ని మీరు చూడలేరు. కాబట్టి, మీరు ఎదుటి వారికీ తెలియకుండా వారి స్టేటస్ చెక్ చేసి మీకు నచ్చిన వారిని ఆటపట్టించాలని అనుకుంటే మాత్రం, మీరు ఒకరి స్టేటస్ ని పరిశీలించాలనుకున్న ప్రతిసారీ ‘ Read Receipt’ ఫీచర్ ని ఆపివేయవచ్చు. కానీ, వాస్తవానికి వీటన్నిటిని చేయ్యడానికి ఎవరికి వద్ద సమయం ఉంది? అయితే, మీకు బాగా ఇష్టమైన వారిని ఆటపట్టించాలని చూస్తే మాత్రం మీరు అప్పుడప్పుడు ఇలా కూడా చేసి చూడవచ్చు.