నెంబర్ సేవ్ చేయకుండా Whatsapp పై మెసేజ్ పంపుట ఎలా?

Updated on 24-Apr-2018

నేడు ఈ ఆర్టికల్ లో, మీ ఫోన్లో కాంటాక్ట్ నెంబర్ ను సేవ్ చేయకుండానే Whatsapp మెసేజెస్  పంపడానికి మీకు ట్రిక్ తెలియజేస్తాము. ఈ ట్రిక్ గురించి ప్రత్యేక విషయం ఏమిటంటే దీని  కోసం ఏదైనా యాప్  డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు. దాని గురించి తెలుసుకుందాం.

 

స్టెప్  1. 
మొదట, మీ స్మార్ట్ఫోన్ లో  వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి . 

స్టెప్ 2. 
బ్రౌజర్ సెర్చ్  బార్ లో  ఈ లింక్ ని  ఇప్పుడు https://api.whatsapp.com/send?phone=XXXXXXXXXXX ను నమోదు చేయండి. "XXXXXXXXXXX" కు బదులుగా,మీరు WhatsApp లో మెసేజ్  పంపడానికి కావలసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. మొబైల్ నెంబర్ యొక్క మొదటి కంట్రీ కోడ్ వేయాలి . 

స్టెప్  3. 
మొబైల్ నెంబర్ వేసిన తర్వాత, లింక్ ఇలా కనిపిస్తుంది.  https://api.whatsapp.com/send?phone=910123456789.

స్టెప్  4. 
ఇప్పుడు స్మార్ట్ఫోన్లో Enter నొక్కండి.

స్టెప్  5. 
మీరు ఇప్పుడు మీ ముందు ఉన్న Whatsapp విండోను కలిగి ఉంటారు మరియు మీరు ఏ నెంబర్ కైతే  మెసేజ్  పంపించాలనుకుంటున్నారో అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది.

స్టెప్ 6. 
ఓకే చేసిన తరువాత  చాటింగ్ ప్రారంభించడంతో ఆటోమాటిక్ గా  విండో రీ డైరెక్ట్ అయ్యి , Whatsapp ఓపెన్ చేయబడుతుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :