Happy Friendship Day 2024: ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డే గా జరుపుకోవడం పరిపాటి. 2024 సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ మొదటి ఆదివారం వచ్చింది కాబట్టి, ఈరోజు ఫ్రెండ్ షిప్ డే ని జరుపుకుంటారు. జీవితంలో అత్యంత సన్నిహితమైన వారిలో స్నేహితుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి మీ స్నేహితులకు విలక్షణ మైన మరియు వారి హృదయాన్ని హత్తుకునేలా అర్ధవంతమైన శుభాకాంక్షలు చెప్పడానికి ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న Meta AI సహాయం చేస్తుంది.
వాట్సాప్ ఇటీవల Meta AI Lalama లేటెస్ట్ వెర్షన్ ను అందించింది. ఈ కొత్త వెర్షన్ తో చాలా సింపుల్ గా క్రియేటివ్ లతొ పాటు యూజర్ కోరుకునే అన్ని వివరాలు అందుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు మీకు నచ్చిన ఫ్రెండ్ కు విలక్షణమైన మరియు యూనిక్ ఇమేజ్ మరియు GIFs లేదా ఇమేజ్ లను పంపించవచ్చు.
ముఖ్యంగా, ఇలా చేయడానికి మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీరు క్రియేట్ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే 2024 ఫోటోలు లేదా ఇమేజ్ లు అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఎవరికైతే విషెస్ చెప్పాలి అనుకుంటున్నారో వారి పేరు జతగా విషెస్ తో కూడిన ఇమేజ్ ను షేర్ చేయవచ్చు. అలాగే, ఫ్రెండ్ షిప్ కొటేషన్ లను కూడా సులభంగా క్రియేట్ చేసి పంపించవచ్చు.
Also Read: Samsung Galaxy F14: రూ. 8,999 ధరకే 50MP ట్రిపుల్ కెమెరాతో వచ్చింది.!
మీ వాట్సాప్ లోని మెటా AI ట్యాబ్ యోగా క్లిక్ చేసి చాట్ లోకి వెళ్లి ఇక్కడ మీకు Happy Friendship Day 2024 Wishes అని టైప్ చేయాలి. ఇలా టిప్ చేయగానే మీకు ఫ్రెండ్ షిప్ డే సంబంధిత కొటేషన్ లు మరియు బెస్ట్ విషెస్ లిస్ట్ అందించబడుతుంది. ఈ విషెస్ లిస్ట్ లో మీకు నచ్చిన వాటిని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేరుతో కూడిన ఇమేజ్ విషెస్ చెప్పాలనుకుంటే, హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే విషెస్ ఫర్ మై ఫ్రెండ్ తర్వాత మీ ఫ్రెండ్ పేరు టిప్ చేసి ఎంటర్ చేయండి.
ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్ పేరు తో కూడిన ఫ్రెండ్ షిప్ విషెస్ ఇమేజ్ అందుతుంది. ఈ విధంగా ఎన్ని సార్లు అడిగినా అన్ని సార్లు సరికొత్త ఇమేజ్ అందిస్తుంది. ఈ ఇమేజ్ లతో మీకు ఫ్రెండ్ కి వెరైటీ గా విషెస్ చెప్పొచ్చు.
హ్యాపీ ఫ్రెండ్ షిప్ ఇమేజ్ మరియు కొటేషన్ లను మెటా Ai నుంచి తెలుగులో పొందడానికి మేము ప్రయత్నించాము. అయితే, కొన్ని సార్లు ఈ ఫీచర్ త్వరలోనే అందుతుంది అని మెసేజ్ చూస్తోంది మరియు కొన్ని సార్లు కొన్ని కొంటేషన్ లను అందిస్తోంది.
ఇమేజ్ సోర్స్ : Meta AI