hike మెసెంజర్ కొత్త ఫీచర్ యాడ్ చేసింది ఈ రోజు. దీని పేరు Hike Direct. ఇది ఇంటర్నెట్ లేదా నార్మల్ WiFi హాట్ స్పాట్ కూడా use చేయకుండా పనిచేస్తుంది.
అంటే.. hike సొంతంగా WiFi హాట్ స్పాట్/ డైరెక్ట్ టెక్నాలజీ లాంటి hike నెట్ వర్క్ ను వాడుతుంది ఈ ఫీచర్ కు. అంటే మీరు 100 మీటర్ రేడియస్ లో ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.
hike డైరెక్ట్ ఫీచర్ ఫోటోస్.. స్టికర్స్, ఫైల్స్ మరియు మెసేజెస్ కూడా పంపుతుంది. 70MB వరకూ సైజ్ లిమిట్ ఉంది దీనిలో. గతంలో కూడా హైక్ ఫ్రీగా స్టాండర్డ్ మెసేజింగ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఇంటర్నెట్ లేని సమయంలో hike ఫ్రెండ్స్ కు ఫ్రీ గా స్టాండర్డ్ మెసేజ్ పంపుతుంది. అవతలి వారు రిప్లై ఇస్తే మళ్ళీ హైక్ లో కనిపిస్తుంది.
వాయిస్ కాలింగ్, 100 మెంబర్స్ గ్రూప్ కాలింగ్.. డిఫరెంట్ ఫైల్స్ షేరింగ్, చాట్ హైడింగ్ వంటి మంచి యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీనిలో.