ఆండ్రాయిడ్ లో బాగా పాపులర్ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన, హైక్ కు కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ లేటెస్ట్ 4.0 అప్ డేట్ లో లుక్స్ తో పాటు చాలా ఎక్కువ ఆప్షన్స్ ను మార్చింది hike.
కొత్త అప్ డేట్ 4.0 వెర్షన్ లో ఏమి మార్చింది..?
1. డిజైన్ పరంగా లుక్స్ మారాయి. అలాగే ఇంతకముందు ఉన్న వెర్షన్స్ కాన్నా ఇది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెబుతుంది హైక్.
2. Low ఎండ్ ఫోనుల కోసం మరియు తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్స్ లో బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది.
3. కొత్తగా 7 చాట్ థీమ్స్ యాడ్ చేసింది. స్టికర్ సజెషన్స్ కూడా వచ్చాయి కొత్తవి.
4. కొత్తగా News అనే ఫీచర్ ను యాడ్ చేసింది. 100 అక్షరాల కన్నా తక్కువలో లేటెస్ట్ న్యూస్ చెబుతుంది.
5. ఇప్పుడు గ్రూప్స్ లో 500 మందిని యాడ్ చేయగలరు. ఒకరికి మించి ఎక్కువ మంది అడ్మిన్ గా కూడా ఉండవచ్చు.
6. ఫేస్ బుక్ వలె యూజర్స్ యొక్క స్టేటస్ లను ఇమేజెస్ ను లైక్ చేయగలరు.
7. మీరు గతంలో చాట్ చేసిన మెసేజ్ లను సర్చ్ చేయవచ్చు ఇప్పుడు.
Hike ఆండ్రాయిడ్ తో పాటు ఐ os, బ్లాక్ బెర్రీ, ovi, విండోస్ స్టోర్స్ కు కూడా అందుబాటులో ఉంది. కాని ప్రస్తుతానికి ఈ అప్ డేట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కు మాత్రమే వచ్చింది. ఈ లింక్ లోకి వెళ్లి ప్లే స్టోర్ నుండి hike ను ఇంస్టాల్ చేసుకోగలరు.