మీ ఫోన్ లో డిలీటైన ఫోటోలను తిరిగి తీసుకువచ్చే బెస్ట్ యాప్స్ ఇవే..!!

Updated on 31-Mar-2022
HIGHLIGHTS

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి అనుకోకుండా డిలీట్ చేశారా

డిలీటైన మీ ఫోటోలను తిరిగి తీసుకొచ్చే యాప్స్ Play Store లో చాలానే వున్నాయి

మీరు Google Play Store లో ఈ ఆప్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి అనుకోకుండా డిలీట్ చేశారా? అయినా సరే, మీరు చింతించాల్సిన పనిలేదు. డిలీటైన మీ ఫోటోలను తిరిగి తీసుకొచ్చే యాప్స్ Play Store లో చాలానే వున్నాయి. అయితే, వాటిలో బెస్ట్ లేదా చాలా సులభంగా ఉపయోగించదగిన యాప్స్ గురించి ఈరోజు మనం చుడనున్నాము. ఈరోజు అటువంటి ఒక 3 Apps గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మరి ఆ బెస్ట్ ఫోటో రికవరీ యాప్స్ మరియు వాటి విశేషాలు ఏమిటో చూసేద్దామా.   

DiskDigger Photo Recovery

ఈ App దాదాపుగా 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది Google Play స్టోర్లో 4.2 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం.ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు.

Deleted Photo Recovery

మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 4.3 స్టార్స్ కలిగివుంది. ఇది 66,000 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది.

Restore Image (Super Easy)

ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత  డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా, Google Play Store లో 4.0 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :