కరోనా ఎఫెక్ట్ :గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచరును జత చేసిన Google
కరోనావైరస్ మహమ్మారి కారణంగా యావత్ భరతదేశ ప్రజలు కేవలం ఇంటికే పరిమితమయ్యారు. అంటే, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల అందరి జీవితాలు కూడా ప్రభావితమయ్యాయని స్పష్టమవుతుంది. 21 రోజుల లాక్ డౌన్ చివరి వారంలోకి ప్రవేశించడంతో, చాలా మంది ప్రజలు ఆహారం లేదా అవసరమైన సేవలకు అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు. అయితే, రిలయన్స్ మరియు ఉబెర్ వంటి సంస్థలు అవసరమైన వ్యక్తులకు సహాయం అందిస్తున్నాయి. సమీపంలో ఏ కిరాణా దుకాణం తెరిచి ఉందో మీకు తెలియజేసే వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ జాబితాలో Google ని కూడా లెక్కించవచ్చు. ఎందుకంటే, ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఒక ఫీచర్‌ను జత చేసింది. దీనిలో, వినియోగదారు తన స్థానాన్ని నమోదు చేసుకున్న వెంటనే, వారికీ దగ్గర్లోని టేకౌట్ లేదా డెలివరీ అందించే రెస్టారెంట్లు వారికీ కనిపిస్తాయి.
అందుకోసం, మీరు Google మ్యాప్స్ ను తెరిచిన వెంటనే, మీరు పైన ఒక వ్యక్తిగత టేకౌట్ మరియు డెలివరీ బటన్ ను గమనించవచ్చు. వీటిలో దేనినైనా క్లిక్ చేస్తే సమీపంలోని టేకౌట్ లేదా డెలివరీని అందించే అన్ని రెస్టారెంట్లు మీకు తెలుస్తాయి. రెస్టారెంట్ యొక్క మెనూ, వారు ఏ సమయంలో ఆహారం అందిస్తున్నారు మరియు ప్రతి రెస్టారెంట్ కోసం కస్టమర్ రివ్యూలను కూడా చూడటానికి ఈ సర్వీస్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నవారికి మరియు వారి స్వంత ఆహారాన్ని వండడానికి అవసరమైన నైపుణ్యం లేదా అవకాశం లేని వ్యక్తులకు ఈ సర్వీస్ ఎంతో సహాయపడుతుంది.
ప్రస్తుతానికి, స్విగ్గి లేదా జోమాటో లేదా ఉబెర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ సర్వీస్ లతో ఎటువంటి ఇంటిగ్రేషన్ లేదు, కానీ ఇది మీరు తినడానికి కావలసినదాన్ని మీకు అందించడంలో సహాయం చేస్తుంది.