గూగల్ wallpapers యాప్ లాంచ్ చేసింది ప్లే స్టోర్ లో. ఇది మొట్ట మొదటిసారిగా Pixel ఫోనులతో వచ్చింది. ఇప్పుడు ప్లే స్టోర్ లో అందరికీ అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 4.1 Jelly Bean OS వెర్షన్ పైన ఉన్న డివైజ్లపై పనిచేస్తుంది యాప్. Earth, Cityscapes, Landscapes, Life etc categories ఉన్నాయి యాప్ లో.
అయితే ప్రస్తుతం ఇమేజెస్ సంఖ్య చాలా తక్కువని చెప్పాలి ఇతర థర్డ్ పార్టీ వాల్ పేపర్స్ యాప్స్ తో పోలిస్తే. అలాగే ఆకర్షణీయమైన పిక్స్ కూడా లేవు.
ఇవి గూగల్ earth, గూగల్ ప్లస్ మరియు 500px.com అనే ఫేమస్ థర్డ్ పార్టీ ఇమేజెస్ పార్టనర్స్ నుండి సేకరించిన పిక్స్ ఇవి. ఫోటో తీసిన వ్యక్తీ పేరు కూడా కనిపిస్తుంది ఇమేజ్ పై.
యాప్ ను ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేయగలరు. యాప్ సైజ్ 2.3MB మాత్రమే. రేటింగ్ 4.8 స్టార్ ఉంది. యాప్, డైరెక్ట్ గా Wallpaper అనే పేరుతో యాప్ drawer లో ఉంటుంది.
మీరు థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతుంటే మీ హోం స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేసి వాల్ పేపర్స్ లోకి వెళ్లి Apps&Themes లోకి వెళ్లి బ్లూ కలర్ లో Wallpapers ఐకాన్ ను ఓపెన్ చేస్తే గూగల్ వాల్ పేపర్స్ పిక్స్ కనిపిస్తాయి.