ప్రపంచ టెక్ దిగ్గజం Google Pixel 8a స్మార్ట్ ఫోన్ తో పాటు Google Wallet యాప్ ని కూడా లాంచ్ చేసింది. యూజర్లకు అనువైన మరియు అవసరమైన పనుల కోసం గూగుల్ ఈ కొత్త యాప్ ను అందించింది. ఇప్పటికే అనేక సర్వీస్ లను అందిస్తున్న గూగుల్, ఈ కొత్త యాప్ తో మరింత అనువైన మరియు వేగవంతమైన యాక్సెస్ అందించే యాప్ ని కూడా అందచేసింది. అయితే, ఇది కూడా Google Pay మాదిరిగా పేమెంట్ యాప్ అని అనుకోకండి, గూగుల్ వాలెట్ అనేది యూజర్ పూర్తి ప్రాపర్టీస్ డిజిటల్ గా దాచుకునే స్థలం.
గూగుల్ వాలెట్ ను 2022 లోనే అమెరికాలో గూగుల్ లాంచ్ చేసింది. ఈ యాప్ మరియు సర్వీస్ ను ఇప్పుడు భారతీయ యూజర్ల కోసం కూడా ప్రవేశపెట్టింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎవరైనా ఈ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ వాలెట్ తో యూజర్ కి అవసరమైన అన్ని ప్రాపర్టీస్ లను డిజిటల్ గా సేవ్ చేసుకోవచ్చు. అంటే, ట్రైన్ టికెట్లు, బోర్డింగ్ పాస్, మెట్రో కార్డ్స్, లాయల్టీ కార్డ్స్ మరియు మరిన్నిటిని డిజిటల్ గా సేవ్ చేసుకోవచ్చు. డిజిటల్ గా సేవ్ చేసిన వాటిని ఆన్లైన్ మరియు ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ లో కూడా యాక్సెస్ చేయవచ్చు.
గూగుల్ వాలెట్ తో ప్రధాన బ్రాండ్స్ లేదా కంపెనీలతో భాగస్వామ్యం ను కూడా గూగుల్ తెలిపింది. ఇందులో ఫ్లిప్ కార్ట్, ఎయిర్ ఇండియా, డొమినోస్, PVR మరియు Inox వంటి 20 పైగా బ్రాండ్స్ తో జత కలిసినట్లు తెలిపింది.
Also Read: CMF Phone (1): సబ్ బ్రాండ్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తెచ్చే ఆలోచనలో ఉన్న Nothing
రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వారికి వీలుగా మెట్రో కార్డ్ లను కూడా గూగుల్ వాలెట్ లో జత చేసుకోవచ్చు కూడా గూగుల్ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి కొచ్చి మెట్రో కోసం మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో వుంది.
వాస్తవానికి, US లో గూగుల్ వాలెట్ నుండి బ్యాంక్ కార్డ్స్ ను యాడ్ చేసుకొని పేమెంట్ లను కూడా నిర్వహించే అవకాశం వుంది. అయితే, ఇండియాలో అందించిన గూగుల్ వాలెట్ లో అటువంటి అవకాశం లేదు. అంటే, గూగుల్ వాలెట్ నుండి కార్డ్స్ లేదా అకౌంట్ లను యాడ్ చేసుకొని పేమెంట్ లను నిర్వహించే అవకాశం ఉండదు.