Google Play Store నుండి 13 మాల్వేర్(హానికర) అనువర్తనాలను తొలగిస్తుంది
ఈ 13 అనువర్తనాలు ఎటువంటి కార్యాచరణ కలిగిలేవని నివేదించబడ్డాయి మరియు నేపథ్యంలో మరొక అనువర్తనాన్ని డౌన్లోడ్ చేస్తాయి మరియు మరొక అనువర్తనాన్ని ఇన్ స్టాల్ చేసేలా, వినియోగదారుని ఉసిగొల్పుతాయి .
గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుండి మాల్వేర్ను కలిగిన ఆప్లను తెసివేయాల్సినపుడు, Google అస్సలు ఆలశ్యం చేయదు. Android అనువర్తనాల కోసం అధికారిక నిలయమైనటువంటి గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇటీవల 13 అనువర్తనాలను దాని జాబితాల నుండి తీసివేసింది. ఎందుకంటే, అవి మాములుగా కనిపంచే మాల్వేర్ అనువర్తనాలు కాబట్టి ఈ చర్య తీసుకోవలసి వచ్చింది.
ఇవి నకిలీవైనాకూడా ఎలా చలామణి అవుతున్నాయో, అనే దానిపై ESET భద్రతా పరిశోధకుడు అయినటువంటి లూకాస్ స్టీఫెన్కో ట్వీట్ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అనువర్తనాలు 'గేమ్ సెంటర్' అనే నేపథ్యంలో మరో APK ను డౌన్లోడ్ చేస్తాయి మరియు దాన్ని ఇన్ స్టాల్ చేసేలా, వినియోగదారుని ఉసిగొల్పుతాయి. వీటిని వ్యవస్థాపించిన (ఇన్ స్టాల్) తర్వాత, ఈ అనువర్తనం బ్యాగ్రౌండ్ లో కనపడకుండా ఉంటుంది మరియు పరికరం అన్లాక్ అయినప్పుడు ప్రకటనలను చూపిస్తుంది.
మాల్వేర్ కలిగి నటువంటి 13 అనువర్తనాలు
ఈ మాల్వేర్ అనువర్తనాల్లో, లగ్జరీ కారు డ్రైవింగ్ సిమ్యులేటర్, ట్రక్ కార్గో సిమ్యులేటర్, ఫైర్ ట్రక్ సిమ్యులేటర్, వంటివి మరొకొన్ని కూడా ఉన్నాయి. ఈ అనువర్తనాల సూక్ష్మచిత్ర చిత్రాలు కూడా చట్టబద్దమైన ఆప్ల మాదిరిగానే తయారు చేయబడ్డాయి మరియు సులభంగా ఎంచుకునేలా ఉంటాయి కూడా . ఈ అనువర్తనాలు మొత్తంగా 560,000 సార్లు డౌన్లోడ్ చేయబడ్డాయి మరియు అవి లూయిస్ పింటో అనే డెవలపర్ చేత చేయబడ్డాయి అని స్టీఫెన్కో చెప్పారు. అతను ఒక అనువర్తనాన్ని ఒక వీడియో ప్రదర్శనను కూడా జతచేసారు. ఇన్స్టాల్ చేసినపుడు మరియు నడుస్తున్న తర్వాత, అనువర్తనం క్రాష్లు అవుతుంది మరియు ఫోన్ నుండి దాని ఐకాన్ దాచివేయబడుతుంది. మొత్తంగా, పదమూడు మాల్వేర్ అనువర్తనాలకు ఎటువంటి కార్యాచరణ లేదు మరియు వాటిలో రెండు ఆప్లను గూగుల్ ప్లే స్టోరులో ట్రేండింగ్ ట్రెండ్ చేయాలని చెప్పబడ్డాయి.
App functionality demonstration pic.twitter.com/11HskeD56S
— Lukas Stefanko (@LukasStefanko) November 19, 2018