Facebook లాగిన్ వివరాల ఫిషింగ్, Google ప్లే స్టోర్ నుండి తొలిగించబడ్డ 25 ప్రముఖ యాప్స్

Updated on 08-Jul-2020
HIGHLIGHTS

Facebook లాగిన్ వివరాలను ఫిషింగ్ చేస్తున్న 25 యాప్స్ ను Play Store నుండి గూగుల్ తొలగించింది.

ఈ యాప్స్ వాస్తవ ఫేస్‌బుక్ లాగిన్ పేజీ పైన ఫాక్స్ లాగిన్ పేజీని సృష్టించడం ద్వారా వినియోగదారుల లాగిన్ వివరాలను సేకరిస్తాయి .

ఫ్రెంచ్ సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీ Evina, ఈ విషయాన్ని పసిగట్టి Google కి రిపోర్ట్ చేసింది.

Facebook లాగిన్ వివరాలను ఫిషింగ్ చేస్తున్న 25 యాప్స్ ను Play Store నుండి గూగుల్ తొలగించింది. అసలువిషయానికి వస్తే, వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్ ను ఉపయోగించి కొన్నియాప్స్ కి లాగిన్ అవ్వడం సర్వసాధారణం. అయితే, ఈ యాప్స్ వాస్తవ ఫేస్‌బుక్ లాగిన్ పేజీ పైన ఫాక్స్ లాగిన్ పేజీని సృష్టించడం ద్వారా వినియోగదారుల లాగిన్ వివరాలను సేకరిస్తాయి . ఫ్రెంచ్ సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీ Evina, ఈ విషయాన్ని పసిగట్టి Google కి రిపోర్ట్ చేసింది.

XDA డెవలపర్స్ ప్రకారం, “ఈ యాప్స్ హానికరమైన అంశాలు కలిగివున్నాకూడా , చట్టబద్ధమైన కార్యాచరణ ముసుగులో దాగివున్నాయి. ఈ యాప్స్,  గూగుల్ ప్లే స్టోర్‌లో వాల్‌పేపర్ యాప్స్ , ఇమేజ్ మరియు వీడియో ఎడిటర్లు, ఫ్లాష్‌లైట్ యాప్స్ , గేమ్స్ మరియు ఫైల్ మేనేజర్స్ వంటి పేర్లతో మారువేషంలో ఉన్నాయని ఎవినా పేర్కొంది. ” ఈ విషయం ఎంత సీరియస్ గా తీసుకోవాలంటే, ఈ హానికరమైన యాప్స్ 2.4 మిలియన్స్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి. అంటే, క్లియర్ గా చెప్పాలంటే.. 24 లక్షల కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్స్ చేయబడ్డాయి.   

ఫ్రెంచ్ సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీ ఎవినా ఈ హానికరమైన యాప్స్ గురించి మే నెలలోనే నివేదించినట్లు ZDNet పేర్కొంది. ఈ యాప్స్ లో  కొన్ని ప్లే స్టోర్ నుండి 5,00,000+ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌ నంబర్ కలిగి ఉన్నాయి. వీటిలో కొన్ని యాప్స్,  సూపర్ వాల్‌పేపర్స్ ఫ్లాష్‌లైట్, వాల్‌పేపర్ స్థాయి, వీడియో మేకర్, సూపర్ బ్రైట్ ఫ్లాష్‌లైట్, సాలిటైర్ గేమ్, ఫైల్ మేనేజర్ మరియు ఇటువంటి మరిన్ని ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :