గూగల్ ప్లే స్టోర్ అతి త్వరలోనే యాప్స్ ను install చేసుకునే టప్పుడు మీ ఫోన్ లో స్టోరేజ్ స్పేస్ లేకపోతే, uninstall యాప్స్ సజెస్ట్ చేస్తుంది.
జనరల్ గా ఫోన్ లో తక్కువ స్టోరేజ్ ఉంటే యాప్ ఇంస్టాల్ చేసేటప్పుడు cannot install due to insufficient storage అనే మెసేజ్ ను చూపిస్తుంది కదా ప్లే స్టోర్..
ఇప్పుడు ఆ మెసేజ్ తో పాటు మీ ఫోన్ లో ఇంస్టాల్ అయ్యి వాడకుండా ఉన్న యాప్స్ ను లిస్టు లో చూపిస్తుంది అక్కడికక్కడే uninstall చేసేందుకు.
అయితే uninstall అదే menu నుండి పనిచేస్తుంది లేదా uninstall menu కు వెళ్లి చేయాలా అనేది ఇంకా తెలియాలి.
కాని ప్లే స్టోర్ ఏది uninstall చేస్తే స్టోరేజ్ సరిపోతుంది అని యాప్స్ ను సజెస్ట్ చేస్తుంది రిమూవ్ చేయటానికి. ఈ ఫీచర్ లో సౌలభ్యం ఒకటే కాదు మీ ఫోన్ లో వాడకుండా ఉన్న మరియు సేఫ్ గా uninstall చేయగలిగే యాప్స్ ను కూడా మీరు తెలుసుకోవటం జరుగుతుంది.