ఆండ్రాయిడ్ లో గూగల్ ప్లే స్టోర్ కు కొత్త డిజైన్
గూగల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్క్రీన్ షాట్స్ ఇమేజెస్ లో టాబ్స్ ఉన్నాయి ప్లే స్టోర్ లో
గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటి వరకూ లుక్స్ వైస్ గా చాలా సార్లు మార్పులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ గూగల్ కొన్ని మార్పులు చేయనుంది అని తాజాగా బయట పడిన కొన్ని స్క్రీన్ షాట్స్ ద్వారా తెలుస్తుంది.
గూగల్ లో పనిచేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన గూగల్ ప్లస్ ప్రొఫైల్ లో కొత్త ప్లే స్టోర్ లుక్స్ తో ఉన్న మొబైల్ స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేశారు.
కొత్త డిజైన్ లో ప్లే స్టోర్ రెండు tabs గా కనిపిస్తుంది. ఒక టాబ్ లో యాప్స్ మరొక టాబ్ లో గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిస్ ఉన్నాయి.
కేటగిరిస్ కు టాప్ చార్ట్స్, న్యూ రిలీజేస్, అప్ డేట్స్, పాపులర్ టైల్స్ వంటి సబ్ హెడింగ్స్ కూడా ఉన్నాయి. ఈ అప్డేట్ తో పాటు RTL సపోర్ట్ కూడా వస్తుంది. RTL అంటే రైట్ నుండి లెఫ్ట్ కు వ్రాసే లాంగ్వేజెస్ సపోర్ట్.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిరిల్ ఇది అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని స్పష్టం తెలపలేదు. కమింగ్ సూన్ అని చేప్పారు. గత నెలలోనే గూగల్ తన లోగో డిజైన్ ను కూడా కొన్ని కలర్స్ తో మార్పులు చేసింది.