గూగల్ ప్లే స్టోర్ అప్ డేట్స్ లో కొన్ని మార్పులను అనౌన్స్ చేసింది. జనరల్ గా ఏదైనా యాప్ అప్ డేట్ చేస్తే, అప్ డేట్ లో మార్పులు ఒకటే ఉన్నా, అప్ డేట్ సైజ్ మాత్రం చాలా ఎక్కువుగా ఉంటుంది.
ఇక నుండి గూగల్ కేవలం మార్పు కు అనుగుణమైన సైజ్ ను మాత్రమే అప్ డేట్స్ లో allow చేయనుంది. అంటే దాదాపు 50% తక్కువ సైజ్ ఉంటాయి ప్లే స్టోర్ లోని అప్ డేట్స్.
రీసెంట్ గా గూగల్ క్రోమ్ M46 నుండి M47 కు అప్ డేట్ అయ్యింది. జనరల్ గా అయితే అప్ డేట్ సైజ్ 22.9MB(ఫుల్ యాప్ సైజ్) ఉండాలి. కాని కేవలం 12.9MB మాత్రమే ఉంది.
సింపుల్ గా చెప్పాలంటే అప్ డేట్స్ లో వచ్చే కొత్త ఫీచర్స్, changes కు మాత్రమే డేటా డౌన్లోడ్ అయ్యి, ఆల్రెడీ పాత వెర్షన్ తో మీ ఫోనులో ఉండే ఫైల్స్ కు యాడ్ అయ్యి అప్ డేట్ ఫినిష్ అవుతుంది.
అలాగే ఏదైనా యాప్ ఇంస్టాల్ చేస్తే actual గా టోటల్ యాప్ డౌన్లోడ్ సైజ్ ను చూపించటం జరుగుతుంది ప్లే స్టోర్ లో. కేవలం apk సైజ్ ఒకటే కాదు. అప్ డేట్ విషయంలో అయితే అప్ డేట్ సైజ్ మాత్రమే చూస్తారు. తక్కువ ఇంటర్నెట్ డేటా లు ఉన్నవారికి useful.