రెండు కొత్త సూపర్ ఫీచర్లను అందుకోనున్నGoogle Photos
ఇది Google ఫోటోస్ యాప్ యొక్క హోమ్ పేజీ ఎగువన కనిపిస్తుంది.
ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజమైనటువంటి, గూగుల్ తన గూగుల్ ఫోటో యాప్ కోసం త్వరలో రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. 9to5Google నివేదిక ప్రకారం, గూగుల్ ఫోటో యాప్ ఖాతాలను మార్చడానికి అప్షన్ ను కలిగి ఉంటుంది మరియు వినియోగదారులు యాప్ డ్రాయింగ్ టూల్ ని కూడా ఉపయోగించగలరు. ట్విట్టర్ యూజర్స్ వారు ఈ ఫీచర్లను మాన్యువల్ గా ఎనేబుల్ చేశారని మరియు ఖాతా స్విచ్చర్ ఫీచర్ Gmail ఖాతా స్విచ్చర్ లాగా చాలా వరకు పనిచేస్తుందని ఈ నివేదిక వెల్లడించింది.
పేరు సూచించినట్లు ఇది స్వైప్-టు-స్విచ్ ఫీచర్. స్మార్ట్ఫోన్ వినియోగదారులు పైకి లేదా క్రిందికి స్వైప్ చేయడం ద్వారా స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న వారి Google ఖాతాకు మారవచ్చు. స్వైప్ చేసినప్పుడు, మీ ప్రొఫైల్ సింబల్ మొదట మారుతుంది మరియు మీరు మీ Google ఖాతాలో ఇమేజిని ఉంచినట్లయితే, అది ఇక్కడ కనిపిస్తుంది లేదా అల్ఫాబిట్ చిహ్నం కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఆగస్టు నెలలో Gmail యాప్ లో ఈ మద్దతు పొందగా, iOS వినియోగదారులు గత సంవత్సరం నుండి దీనిని ఉపయోగిస్తున్నారు.
ఈ క్రొత్త ఫీచరును ఎప్పుడు పొందుతారు
ఈ అప్డేట్ యొక్క రోల్ అవుట్ వివరాలను కంపెనీ ఇంకా తెలియపరచలేదు, అయితే, ఈ లక్షణాలు పూర్తిగా పనిచేస్తున్నందున, కంపెనీ వాటిని త్వరలో విడుదల చేస్తుంది.
గత నెలలో, ఫేస్‌బుక్ మాదిరిగానే గూగుల్ ఫోటోస్ యాప్‌లో మెమోరీస్ అనే ఫీచర్ కనుగొనబడింది. మెమొరీస్ ఫోటోలు మరియు వీడియోలు రెండింటినీ కలిగి ఉంటాయి మరియు ఇది Google ఫోటోస్ యాప్ యొక్క హోమ్ పేజీ ఎగువన కనిపిస్తుంది.