Google Pay Users Alert: మీ ఫోన్ లో గూగుల్ పే ఉంటే ఈ యాప్స్ వాడొద్దు.!
యూజర్ల కోసం Google Pay Users Alert ను విడుదల చేసింది
గూగుల్ పే వాడుతున్న యూజర్లు వారి ఫోన్ లలో ఈ యాప్స్ ను వాడొద్దని తెలిపింది
యూజర్ల సెక్యూరిటీ ని పటిష్టంగా ఉంచడానికి కృషి చేస్తున్న Google Pay
గూగుల్ పే ఉపయోగిస్తున్న యూజర్ల కోసం Google Pay Users Alert ను విడుదల చేసింది. గూగుల్ పే వాడుతున్న యూజర్లు వారి ఫోన్ లలో ఈ యాప్స్ ను వాడొద్దని తెలిపింది. గూగుల్ పే లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా యూజర్ల సెక్యురిటి పెంచింది. కొన్ని యాప్స్ యూజర్స్ యొక్క వివరాలను సేకరించి వారికీ తెలియకుండా లావాదేవీలను జరిపే అవకాశం కలిగి ఉన్నాయి. అందుకే, ఈ యాప్ లను యూజర్లు వారి మొబైల్ ఫోన్ లలో ఉపయోగించడం మంచిది కాదని తెలిపింది.
Google Pay Users Alert:
ఇండియాలో అతిపెద్ద UPI ప్రెమెంట్ యాప్ లలో ఒకటైన గూగుల్ పే కొత్త అలర్ట్ ను తన యూజర్ల కోసం అందించింది. యూజర్ల సెక్యూరిటీ ని పటిష్టంగా ఉంచడానికి కృషి చేస్తున్న గూగుల్ పే కోసం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మరియు మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తోంది. దీని ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉన్న అన్ని మార్గాలను పసిగడుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ కొత్త విషయాన్ని పసిగట్టి యూజర్లను హెచ్చరించింది.
Also Read : AI-ENC తో కొత్త ఇయర్ బడ్స్ లాంఛ్ చేస్తున్న MIVI
ఏమిటా యాప్స్ ఎందుకు వాడకూడదు?
లావాదేవీలు జరిపే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్స్ ను ఫోన్ లలో ఉపయోగించడం మంచిది కాదని గూగుల్ పే చెబుతోంది. పెమెంట్స్ చేసే ముందుగా అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ ను క్లోజ్ చేయడం ఉత్తమం అని గూగుల్ పే సూచిస్తోంది. ఎందుకంటే, ఈ పెమెంట్స్ చేసే సమయంలో ఈ యాప్స్ మీ వివరాలను చూడటానికి మరియు మీ డివైజ్ ను కంట్రోల్ చేయడానికి ఇతరులను అనుమతిస్తాయి.
అందుకే, ఇటువంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ను గూగుల్ పే లో లావాదేవీలు చేసే సమయంలో ఉపయోగించడం మంచిది కాదని హితవు పలికింది. ఇక ఈ యాప్స్ విషయానికి వస్తే, ఇందులో స్క్రీన్ షేరింగ్, టీమ్ వ్యూవర్ మరియు ఎనీడెస్క్ వంటి యాప్స్ ఉంటాయని చెబుతోంది.
సింపుల్ గా చెప్పాలంటే, పెమెంట్స్ చేసే సమయంలో ఈ యాప్స్ ను ఉపయోగించడం ద్వారా మోసగాళ్లు మీ ఫోన్ ద్వారా పెమెంట్స్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకే, ఈ యాప్స్ ఉపయోగించేప్పుడు జాగ్రత్త వహించడం మంచిదని గూగుల్ పే యూజర్ల కోసం అలర్ట్ అందించింది.