మంగళవారం గూగల్ మ్యాప్స్ ఆఫ్ లైన్ కు కొత్త అప్ డేట్ ను అనౌన్స్ చేసింది గూగల్. ఇప్పటి వరకూ మ్యాప్స్ ను ఇంటర్నెట్ లేనప్పుడు కూడా చూసేందుకు వీలుగా ఆఫ్ లైన్ మ్యాప్స్ ను అందిస్తుంది గూగల్.
ఇప్పుడు కేవలం మ్యాప్స్ అనే కాకుండా, ప్లేసెస్ నేవిగేషన్ అండ్ ప్లేసెస్ సర్చ్ ను కూడా ఆఫ్ లైన్ చేస్తుంది గూగల్ మ్యాప్స్. ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్ కు ముందుగా అందిస్తుంది. త్వరలోనే iOS కూడా విడుదల చేస్తారని చెప్పటం జరిగింది. ఈ ఆఫ్ లైన్ లో ట్రాఫిక్ అప్ డేట్స్ రావు.
మొత్తం 60 శాతం users కు మంచి ఇంటర్నెట్ సోర్స్ లేదు. సో అలాంటి వారు ఎక్కడకు వెళ్ళినా మ్యాప్స్ ఉపయోగపడేలా ఉంటుంది అని ఈ ఫీచర్ ప్రవేశ పెడుతున్నాం. ఇక ఇంటర్నెట్ లేకపోయినా వెల్ల వలిసిన గమ్య స్థానాలు లేదా ఇతర కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను సర్చ్ చేసి తెలుసుకోగలరు.
అయితే ఈ ఆఫ్ లైన్ ఫీచర్స్ పని చేయాలంటే, ముందుగా మీరు ఫోన్ లో మీ సిటీ, ఏరియా మ్యాప్స్ ను ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇది ఇంకా అప్ డేట్ రూపం లో రాలేదు. నిన్ననే అనౌన్స్ అయ్యింది. సో 2 డేస్ లో వచ్చే అవకాశం ఉంది.