గూగల్ ఈ ఇయర్ లో గూగల్ మ్యాప్స్ కు ఆఫ్ లైన్ ఫీచర్ తెస్తుంది అని అనౌన్స్ చేసింది. చెప్పినట్టు గానే ఇప్పుడు గూగల్ మ్యాప్స్ కు ఆఫ్ లైన్ నేవిగేషన్ మరియు సెర్చ్ ఆప్షన్ తెచ్చింది.
ఇండియాలో ఈ అప్ డేట్ రోల్ అవుతుంది ఇప్పుడు. సో ఇక మీరు కూడా ఈ ఫీచర్ ను యాక్సిస్ చేయవచ్చు. మిగిలిన దేశాలలో ఇంకా రాలేదు. త్వరలో ఇతర దేశాల్లో కూడా అప్ డేట్ ఇస్తుంది.
ఇది నిజంగా బాగా useful. మీకు ఇంటర్నెట్ లేకపోయినా గూగల్ మ్యాప్స్ సహాయంతో అన్ని ప్రదేశాలు తెలుసుకోగలరు. కొంతమందికి ఇంటిలో లేదా ఆఫీస్ లో WiFi ఉంటుంది కాని మొబైల్ లో నెట్ ఉండదు.
సో అలాంటి వారికి అలాగే ఇంట్లోని పెద్ద వాళ్లకు కూడా use అవుతుంది వారు అలవాటు పడితే. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మ్యాప్స్ డేటా అంతా మొబైల్ లో సేవ్ చేసుకుంటే, సేవ్ అయిన డేటా నుండి నేవిగేషన్ అండ్ ప్లేసెస్ సర్చింగ్ పనిచేస్తాయి.
ఇంటర్నెట్ ఉంటే అదే మ్యాప్స్ లో లైవ్ ట్రాఫిక్ మరియు ఇతర చిన్న ఫీచర్స్ ను పొందగలరు. ఈ ఆఫ్ లైన్ ఫీచర్స్ కేవలం ఆండ్రాయిడ్ కు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం. iOS కు మరింత టైమ్ పడుతుంది.
ఎలా పొందాలి ఆఫ్ లైన్ మ్యాప్స్..?
మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ ఉండే మెను పై క్లిక్ చేస్తే Offline Maps అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి + సింబల్ ను ప్రెస్ చేయాలి.
ఇప్పుడు మీకు కావలిసిన మ్యాప్స్ ఏరియా ను టైప్ చేయండి. తరువాత మీ ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ మీరు తిరిగే ప్రదేశాలు అనుగుణంగా క్రింద మ్యాప్స్ లో ఏరియా ను సెలెక్ట్ చేయండి.
అయితే 30 రోజుల తరువాత అదే మ్యాప్స్ ను మళ్ళీ డౌన్లోడ్ చేయాలి అలానే. మ్యాప్స్ 30 రోజులకు కొత్త మార్పులతో ఉంటుంది కనుక గూగల్ రీ డౌన్లోడ్ ఆప్షన్ పెట్టింది.