గూగల్ మ్యాప్స్ కొత్తగా ఈ మధ్యనే రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ ను ఇవ్వటం స్టార్ట్ చేసింది. అయితే అది హైదరాబాదు మొదలగు మెట్రో సిటీస్ లోనే సపోర్ట్ చేసింది. ఇప్పుడు వైజాగ్, నాగపూర్, కోచి, కోల్కతా, లుథియానా, ఇండోర్, లక్నో, తిరువునంతపురం, భోపాల్ మరియు మదురై సిటీలకు కూడా రియల్ టైమ్ ట్రాఫిక్ గురించి తెలుసుకోగలరు.
మొత్తం ఇండియాలో 34 సిటీలకు గూగల్ ట్రాఫిక్ డిటేల్స్ ను ఇస్తుంది. అంతే కాదు దేశం లోని అన్ని నేషనల్ హై వే లలో ఇది ట్రాఫిక్ స్టేటస్ ను చూపెడుతుంది మ్యాప్స్ లో. రియల్ టైమ్ సెట్టింగ్ ను ఆన్ చేసుకుంటే యూజర్స్ మ్యాప్స్ లో ఆప్షన్స్ లోకి వెల్లి Traffic ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ స్క్రీన్ పై ఉన్న మ్యాప్స్ లో కలర్స్ లో గీతాలు కనిపిస్తాయి.
రెడ్ కలర్ ఉన్న ప్రదేశాలలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉందని, గ్రీన్ కలర్ ఉన్న ఏరియా లలో తక్కువ ట్రాఫిక్ ఉందని, ఆరెంజ్ కలర్ ఉన్న ప్రదేశాలలో moderate ట్రాఫిక్ ఉందని వీటి సంకేతాలు. ఇది ఆఫీస్ నుండి ఇంటికి బయలదేరే ముందు, హై వే లో ప్రయాణాలు మొదలు పెట్టే ముందు ఉపయోగకరంగా అనిపిస్తుంది. మొబైల్ మరియు వెబ్ మ్యాప్స్ లో పనిచేస్తుంది.