గూగల్ ఆండ్రాయిడ్ పెయిడ్ యాప్స్ ను వారానికి ఒకటి చొప్పున ప్రతీ వారం ఇక నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకునేందుకు కొత్తగా అవకాశం కలిపిస్తుంది. అయితే ఇది కేవలం తాజాగా ప్రారంభించిన ఫ్యామిలీ సెక్షన్ కే పరిమితం. "Free app of the week" పేరుతో ఫ్యామిలీ సెక్షన్ లో గూగల్ ప్లే స్టోర్ లో ఇది అందుబాటులో ఉండనుంది.
తాజాగా జరిగిన గూగల్ I/O డెవలపర్ కాన్ఫిరేన్స్ లో ఇక నుండి ఫ్యామిలీ ఫ్రెండ్లీ యాప్స్ ను సులువుగా తెలుసుకునేందుకు ప్లే స్టోర్ లో అవకాశం ఇవ్వనుంది అని గూగల్ చెప్పింది. ప్రస్తుతం ఫేమిలీ సెక్షన్ లో PBS Kids డెవలప్ చేసిన Daniel Tiger Grr-ific Feelings ఫ్రీ గా దొరుకుతుంది. దీని ఒరిజినల్ ప్రైస్ 2.99$.
ఇప్పటి వరకూ ఐ os మరియు అమెజాన్ ఆప్ స్టోర్ లలో ఈ పద్ధతి ఉండేది. మొదటి సరి ఇప్పుడు గూగల్ అఫీషియల్ గా ప్రవేసపెట్టింది. డెవలపర్స్ ఒకసారి పెయిడ్ యాప్ అని పెట్టుకున్న దానిని ఫ్రీ గా మార్చటం అనేది వీలు అయ్యేది కాదు ఆండ్రాయిడ్ లో. ఇప్పుడు ఒక డిస్కౌంట్ కోడ్ ను అప్లై చేస్తే యాప్ యొక్క ధర జీరో అయ్యి ఫ్రీ గా లభిస్తుంది. ఇది కేవలం గూగల్ నిర్ణయించిన యాప్ కు మాత్రమే వారానికి ఒకటి చొప్పున ఫ్రీ గా దొరుకుతుంది.
అయితే ప్రస్తుతానికి ఫేమిలీ సెక్షన్ కే పరిమితం అయిన ఈ ఆఫర్ మిగిలిన సెక్షన్ లకు కూడా వ్యాపిస్తే యూజర్స్ కు నచ్చే అవకాశం ఉంది. లేదా కేవలం ఫ్యామిలీ సెక్షన్ ను ప్రోమోట్ చేసేందుకే గూగల్ ఈ ఆఫర్ పెట్టినట్లు అయితే ఫ్యూచర్ లో మిగిలిన సెక్షన్లకి ఇది రానట్లే. మొత్తం అన్ని ఆప్స్ స్టోర్ లలో గూగల్ ఆండ్రాయిడ్ ఆప్ స్టోర్ కు ఉన్న అప్లికేషన్లు దేనికి లేవు. ఐ os దగ్గరిలో ఉన్నా, అందులో పెయిడ్ యాప్స్ ఎక్కువుగా ఉంటాయి.
ఆధారం: Android Police