TikTok కి పోటీగా Tangi App ను తెచ్చిన గూగుల్

Updated on 31-Jan-2020
HIGHLIGHTS

ఈ యాప్ ను మీరు విద్యా ప్రయోజనం కోసం కూడా ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కట్టిపడేస్తున్న ప్రధమ అప్లికేషనుగా టిక్‌ టాక్‌ నిలుస్తుంది. అయితే, ఈ అప్లికేషన్(App) తో పోటీ పడటానికి, గూగుల్ TANGI అనే App ని ప్రారంభించింది. ఇది స్వల్ప-రూప (షార్ట్ -ఫామ్) వీడియో తయారీ యాప్. ఈ టాంగి అప్లికేషన్ని గూగుల్ యొక్క ఇన్-హౌస్ ఇంక్యుబేటర్ ఏరియా 120 టీం అభివృద్ధి చేసింది. ఇది ప్రయోగాత్మక సోషల్ వీడియో షేరింగ్ అప్లికేషన. దీని ద్వారా మీరు శీఘ్ర DIY వీడియోలను సృష్టించడం ద్వారా ఇతరులతో మీ వీడియోలను పంచుకోవచ్చు ( షేర్ చెయ్యవచ్చు).

ఇక సులువైన పద్ధతిలో చెప్పాలంటే, టిక్‌టాక్ మాదిరిగా, వినియోగదారులు 60 సెకన్ల వీడియోలను సృష్టించవచ్చు. టిక్ టాక్ యాప్, వినోదం కోసం ఉపయోగించబడుతుండగా, ఈ యాప్ ను మీరు విద్యా ప్రయోజనం కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ అప్లికేషన్, వీడియోల కోసం DIY, వంట, జీవనశైలి, కళ, ఫ్యాషన్ మరియు అందం వంటి అనేక కేటగిరీలను కలిగి ఉంది.

అయితే, ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ యొక్క యాప్ స్టోర్ మరియు వెబ్‌ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఇంకా తీసుకురాలేదు. ఈ App ను యూరోపియన్ యూనియన్ మినహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంచింది. అయితే, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ అప్లికేషన్ ఎప్పటి వరకూ అందుబాటులోకి తీసుకువస్తున్నదన్నవిషయం పైన ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ యాప్  లో  కొద్ది మంది మాత్రమే వీడియోలను అప్‌ లోడ్ చేయగలరని, ఈ వినియోగదారులు ముందుగా వెయిట్‌ లిస్ట్‌లో చేరాల్సి ఉంటుందని గూగుల్ తెలిపింది.

ఇక టిక్‌టాక్ గురించి తెలియని వారికోసం, ఇది ఒక సోషల్ మీడియా యాప్, ఇందులో వినియోగదారులు 15 సెకన్ల నుండి 60 సెకన్ల వరకు చిన్న వీడియోలను పోస్ట్ చేయవచ్చు. మీరు ఈ app లో చూసే వీడియో మరియు మీరు ఆ వీడియోలను చూసే సమయాన్ని బట్టి, అల్గోరిథం మీ ఫీడ్‌లోని కంటెంట్‌ ను నిరంతరంగా చూపుతుంది. బైట్ డాన్స్ సంస్థ యొక్క ఈ అప్లికేషన్ మొత్తం 1.5 బిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది.

టిక్‌ టాక్‌ను తొలిసారిగా 2016 సెప్టెంబర్‌ లో చైనాలో లాంచ్ చేశారు. 2017 లో ఈ యాప్‌ ను ఇతర మార్కెట్లకు విడుదల చేశారు. ఒక 2018 లో, అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ అప్లికేషన్లలో ఈ యాప్ నాల్గవ స్థానంలో ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :