గూగల్ ప్లస్ కు పెద్ద అప్ డేట్ : యూసర్ ఇంటర్ఫేస్ మార్పులు
కమ్యూనిటిస్ అండ్ కలెక్షన్స్ పై ఫోకస్
గూగల్ ప్లస్ వెబ్, ఆండ్రాయిడ్ అండ్ iOS ప్లాట్ ఫార్మ్స్ లో మేజర్ అప్ డేట్ Unveil అయ్యింది. డిజైన్ – యూసర్ ఇంటర్ఫేస్ అండ్ ఫీచర్స్ కూడా మార్పులు జరిగాయి.
దీనిలో ప్రధానంగా కమ్యూనిటిస్ మరియు కలెక్షన్స్ కు బాగా changes చేసింది గూగల్ ప్లస్ టీమ్. సర్చ్, పోస్ట్ మరియు ఇతర users తో కనెక్ట్ అవటం వంటివి మరింత సులభతరం అయ్యాయి.
నేవిగేషన్ లో ఇక కమ్యూనిటిస్ అండ్ కలెక్షన్స్ ఫీచర్స్ కనిపిస్తాయి. కలెక్షన్స్ లో పిన్ interest, గ్రూప్ users కామెంట్స్, షేర్, డిస్కస్ వంటివి ఉన్నాయి.ఒక పర్టికులర్ టాపిక్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావలసిన వారికి కూడా ఇది డిస్కవరీ టూల్ మాదిరిగా పనిచేస్తుంది.
కమ్యూనిటిస్ లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి. హోమ్ స్ట్రీమ్ లో user కు అనుగుణంగా కంటెంట్ స్మార్ట్ అండ్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. దీని కొత్త మార్పులు చూడటానికి సైన్ in అయ్యి, Lets Go బటన్ పై ప్రెస్ చేయగలరు.
వెబ్ వెర్షన్ లో గూగల్ ప్లస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కూడా అప్ డేట్ ను యాక్సిస్ చేయగలరు. వెబ్ లో ప్రస్తుతానికి రోల్ అవుతుంది అప్ డేట్. Manual గా enable చేయటానికి left సైడ్ google plus క్రింద ఉన్న హోమ్ బటన్ గూగల్ ప్లస్ సెట్టింగ్స్ కి వెళ్లి "Manage other apps & activity" పై క్లిక్ చేస్తే "Manage Google+ activity" అని ఉంటుంది.
ఇప్పుడు పైన ఉండే సర్చ్ బార్ పై క్లిక్ చేస్తే కొత్త UI లుక్స్ కనిపిస్తాయి వెబ్ లో. ఆండ్రాయిడ్ అండ్ iOS కు కొన్ని వారాల్లో రానుంది. ఫేస్ బుక్ కు పోటీ గా గూగల్ ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ redesign సక్సెస్ అయ్యిందా లేదా అనేది కొంత కాలం వెయిట్ చేస్తే తెలుస్తుంది.