గూగల్ Duo యాప్ లింక్స్ పనిచేస్తున్నాయి. చేయని వారు ఇలా చేయండి.

Updated on 17-Aug-2016

నిన్న గూగల్ రిలీజ్ చేసిన Duo యాప్ గురించి తెలపటం జరిగింది. అయితే గూగల్ ముందు చెప్పినట్లుగా అన్ని దేశాల్లో రిలీజ్ చేయలేదు. కేవలం యాప్ ను కొన్ని దేశాలలోనే రిలీజ్ చేసింది.

ఇది నిన్న రాత్రి లోపు ఇంస్టాల్ ఆప్షన్ చూపిస్తుంది అని తెలిపాము. కాని ఇండియన్స్ కు ప్రీ రిజిస్టర్ ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది అని తెలిపారు. సో మీరు మరొక సారి  ఈ లింక్ లో ప్లే స్టోర్ లోకి వెళ్లి చూస్తే మీకు ఇంస్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు.

కనిపించని వారు apk ఫైల్ ను సెపరేట్ గా ఇంస్టాల్ చేసుకోగలరు. ఒకసారి  ట్రై చేయండి. ఈ లింక్ లో ఉంది Ddo apk. పనిచేస్తే కామెంట్స్ లో ఇతర టెక్నికల్ ఇంటరెస్ట్ ఉన్న మిత్రులకు తెలపండి.​ iOS లో కూడా ఇంస్టాల్ ఆప్షన్ చూపిస్తుంది.

ఇది వాట్స్ అప్ లానే ఫోన్ నంబర్ తో పనిచేస్తుంది. email id వంటివి ఉండవు. యాప్ 720P HD వీడియో రిసల్యుషణ్ కాల్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

వీడియో కాలింగ్ కూడా ఎన్క్రిప్షన్ సపోర్ట్ ఉంది privacy కు ఇబ్బంది లేకుండా. ప్రధాన highlight ఏంటంటే మీకు ఎవరినా duo లో కాల్ చేస్తుంటే..

వారి కాల్ ను మీరు లిఫ్ట్ చేయకముందే వారి వీడియో చూపిస్తుంది. సో అవతల వ్యక్తీ ఉన్న పరిసరాల బట్టి మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలో లేదో డిసైడ్ చేసుకోగలరు.

ఈ క్రింద కూల్ ప్యాడ్ నోట్ 3 Lite వీడియో రివ్యూ ను తెలుగులో చూడగలరు..
 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :