Jibe మొబైల్ డాట్ కామ్ అనేది కొన్ని దేశాలలో పనిచేస్తున్న ఆండ్రాయిడ్ అండ్ ios యాప్. ఇది ఇంటర్నెట్ ద్వారా కాకుండా మొబైల్ నెట్వర్క్ ద్వారా వీడియో కాలింగ్ మరియు రిచ్ టెక్స్ట్ మెసేజింగ్ కోసం డెవలప్ చేయబడింది.
నిన్న గూగల్ ఈ సర్విస్ ను కొన్నాది. వాట్స్ అప్, ఫేస్ బుక్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ అండ్ కాలింగ్ కమ్యునికేషన్స్ అప్లికేషన్స్ వచ్చిన తరువాత స్టాండర్డ్ మెసేజింగ్ అనేది చాలా వెనక పడిపోయింది.
సో jibe మొబైల్స్ దానిని డెవలప్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీని గురించి మొబైల్ ఆపరేటర్స్ తో మాట్లాడి.. ఈ సర్విస్ ను వాళ్ళ నెట్వర్క్ లో పెట్టటానికి గూగల్ ప్రయత్నాలు చేస్తుంది.
అంటే ఇది మన దేశంలో కూడా వస్తే వాట్స్ అప్ లో ఇమేజ్, ఆడియో, వీడియోస్ ను సింపుల్ గా షేర్ చేసినట్టే, ఇక మీదట నుండి మల్టీ మీడియా మెసేజింగ్ లా కాకుండా రిచ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా స్టాండర్డ్ మెసేజింగ్ ద్వారా కమ్యునికేట్ చేయాగలం.