Google I/O 2016 (Innovation in the Open) జరుగుతుంది ప్రస్తుతం. ఈ సందర్భంగా ఈ ఇయర్ లో లాంచ్ చేయబోయే విషయాలను తెలియజేస్తుంది ఈవెంట్ లో.
Allo అనే పేరుతో instant మెసేజింగ్ యాప్ ను డెవలప్ చేసింది. దీని లో గూగల్ అసిస్టంట్ ఉంటుంది. అంటే మ్యాప్స్, రూట్స్, టికెట్స్, సర్చ్ ఇన్ the యాప్, హోటల్స్, flights, youtube, translate అన్నీ యాప్ లోనే అందిస్తుంది అసిస్టెంట్.
ఇంకా మీరు వాడె వర్డ్స్ బట్టి రిప్లై టైప్ చేస్తున్నప్పుడు స్మార్ట్ reply suggestions ఇస్తుంది ఆటోమేటిక్ గా. చాట్ టెక్స్ట్ resizing అండ్ text రైటింగ్ ఆన్ ఇమేజెస్ అండ్ sending.
దీనిలో Incognito బ్రౌజర్ లా, incognito చాట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే సిక్రెట్ చాటింగ్. మెసేజెస్ అన్నీ ఆటోమేటిక్ గా డిలిట్ అయిపోతాయి సెండ్ చేసిన తరువాత. అలాగే సెక్యూర్ కూడా.
Duo అనే వీడియో కాలింగ్ యాప్ ను సెపరేట్ గా డెవలప్ చేసింది. ఇది అవతల వ్యక్తులకు కూడా Duo ఉంటే వీడియో కాలింగ్ చేసి సింపుల్ యాప్. సెక్యూర్ గా end-to-end ఎన్క్రిప్షన్ తో వస్తుంది .
కాని స్పెషల్ ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉన్నా పనిచేస్తుంది అని చెబుతుంది కంపెని. అలాగే స్పీడ్ బాగున్న వారు HD వీడియో కాలింగ్ చేసుకోగలరు ఫోన్ లోని కాంటాక్ట్స్ కు.
అలాగే Duo లో Knock Knock అనే ఫీచర్ ఉంది. మీరు Duo లో వీడియో కాల్ లిఫ్ట్ చేసేముందు వీడియో కాల్ చేస్తున్న వ్యక్తీ యొక్క వీడియో ను చూపిస్తుంది మీ స్క్రీన్ పై. కాల్ లిఫ్ట్ చేయగానే ఆడియో యాడ్ అయ్యి కనెక్ట్ అవుతారు.
Allo యాప్ కొరకు pre register చేసుకోండి ఈ లింక్ లో. Duo యాప్ ను ఈలింక్ లో ప్రీ రిజిస్టర్ చేసుకోండి. మరొక నెలలో ఆండ్రాయిడ్ అండ్ ఐ OS కు కూడా వస్తున్నాయి యాప్స్ రెండూ. అయితే గూగల్ hangouts ను కూడా కంటిన్యూ చేస్తుంది కంపెని.