గూగల్ కీ బోర్డ్ కొత్త వెర్షన్ 5.0 అప్ డేట్ రిలీజ్: దీనిలోని కొత్త ఫీచర్స్

గూగల్ కీ బోర్డ్ కొత్త వెర్షన్ 5.0 అప్ డేట్ రిలీజ్: దీనిలోని కొత్త ఫీచర్స్

గూగుల్ కీ బోర్డ్ యాప్ 5.0 వెర్షన్ కు అప్ గ్రేడ్ అయ్యింది. కొత్త అప్ డేట్ లో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటో చూద్దాం రండి..

  • వన్ హ్యాండ్ మోడ్ – అంటే లార్జ్ స్క్రీన్ కలిగిన ఫోనులపై ఒకే చేతితో కూడా టైప్ చేసే విధంగా ఇది సహాయ పడుతుంది. ఈ ఫీచర్ ఆల్రెడీ థర్డ్ పార్టీ కీ బోర్డ్ యాప్స్ లో ఉంది.
  • కీ బోర్డ్ height adjustment.
  • హైట్ adjustment అనేది కీ బోర్డ్ హైట్ ను మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవటానికి. అంటే మీ ఫోన్ స్క్రీన్ చిన్నదైతే కీ బోర్డ్ layout ను కొంచెం చిన్నగా క్రిందకు compress చేయగలరు హైట్ తగ్గించి..
  • ఇప్పుడు ఏ key పైనైనా లాంగ్ ప్రెస్ చేసి సింబల్ ను పొందగలరు. సెపరేట్ గా సింబల్స్ layout లోకి ఎంటర్ అవనవసరం లేదు. ఇది కూడా మంచి టైమ్ సేవింగ్ ఫీచర్ అని చెప్పాలి.
  • ఎంటర్ కీ ను లాంగ్ ప్రెస్ చేస్తే emojis స్మైలీ సింబల్స్ ను కూడా వెంటనే access చేయగలరు.
  • మీరు టైప్ చేస్తుండగా ఆటోమేటిక్ గా పైన వచ్చే వర్డ్స్ పై లాంగ్ క్లిక్ చేసి వాటిని మీ ఫోన్ గూగల్ కీ బోర్డ్ డిక్షనరీ నుండి డిలిట్ చేయగలరు.
  • gesture టైపింగ్ లో నెక్స్ట్ వర్డ్ కూడా prediction బార్ లో కనిపిస్తుంది, hovering లో కాకుండా.
  • స్పేస్ బార్ ను లెఫ్ట్ కు స్వైప్ చేస్తే cursor లెఫ్ట్ కు వెళ్తుంది, రైట్ కు స్వైప్ చేస్తే కర్సర్ రైట్ కు వెళ్తుంది.
  • డిలిట్ కీ పై లెఫ్ట్ కు స్వైప్ చేస్తే కంప్లీట్ గా వర్డ్స్ ను డిలిట్ చేయగలరు.

ఈ అప్ డేట్ దశల వారిగా అందరికీ వస్తుంది. రాని వారు రాలేదేంటి అనుకోకండి. కంపెని అప్ డేట్ ను నెమ్మదిగా రోల్ చేస్తుంది. గతంలో బెస్ట్ తెలుగు/ఇంగ్లీష్ కీ బోర్డ్స్ గురించి చేసిన స్టోరీ ను ఈ లింక్ లో చూడగలరు..

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo