ఇప్పటికే అన్ని ప్రధాన యాప్స్ కూడా డార్క్ మోడ్ లోకి మారాయి. అయితే, యూజర్లు ట్రావెలింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ మాత్రం ఇప్పటి వరకూ డార్క్ మోడ్ లో లేకపోవడంతో, గూగుల్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ను కూడా డార్క్ మోడ్ లో ఇవ్వడానికి సిద్దవుతోంది. వాస్తవానికి, వినియోగదారుల కళ్ళకు హాని కలిగించకుండా ఈ డార్క్ మోడ్ ఉపయోగపడుతుంది. అందుకే, ఎక్కువగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ లో ఈ డార్క్ మోడ్ రావడం చాలా మంచిది.
గూగుల్ మ్యాప్స్ లో ఈ డార్క్ మోడ్ ను సెట్ చేసుకోవడానికి థీమ్ లోకి వెళ్లి 'ఆల్వేస్ ఇన్ డార్క్ థీమ్' ఎంచుకోవడం ద్వారా డార్క్ మోడ్ ను ఎంచుకోవచ్చు. గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ డార్క్ థీమ్ ను రోల్ అవుట్ చేసింది. ఇక డార్క్ మోడ్ నుండి మాములుగా మార్చాలంటే, జెస్ట్ థీమ్ లోకి వెళ్లి 'ఆల్వేస్ ఇన్ లైట్ థీమ్' ని ఎంచుకుంటే సరిపోతుంది.
గూగుల్ మ్యాప్స్ లో డార్క్ మోడ్ అనేది కళ్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించని సేఫ్ నావిగేషన్ కు సహాయపడుతుంది. అంతేకాదు, బ్యాటరీని కూడా సేవ్ చేస్తుంది.