ప్లే స్టోర్ లేటెస్ట్ వెర్షన్ 6.9.15 కొంతమందికి బ్యాటరీ బాగా వాడుకుంటుంది అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి. దీనికి గూగల్ ప్లే కమ్యూనిటీ మేనేజర్ Armanda స్పందించారు.
GPS ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి మీ ఏరియా/కంట్రీ కు తగ్గట్టుగా యాప్ రికమెండేషన్స్ చూపించటానికి చేసే ప్రయత్నాలలో ప్లే స్టోర్ location ట్రాక్ చేయలేకపోతుంది.
సో ఇలా ఎక్కువ సార్లు attempts చేయటం అనేది బ్యాటరీ కు ఎఫెక్ట్ చూపిస్తుంది అని తెలిపారు Armanda. కొద్ది రోజుల్లోనే దీనికి అప్ డేట్ రిలీజ్ చేసి ఫిక్స్ చేయనున్నట్లు కూడా అన్నారు.
అప్పటివరకూ ఉండలేకపోతే, మీరు వెర్షన్ నంబర్ 5.1.11 ను ఇంస్టాల్ చేసుకోగలరు. దీనిలో ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేవు. అయితే రూటింగ్ అనుభవం ఉన్నవారే ఇది చేయగలరు.