PAYTM యూజర్స్ కి ఒక శుభవార్త
వాలెట్ లో వున్న మనీ మరియు వాలెట్ యాప్ కలిగి వున్న ఫోన్ పోయినట్లయితే దానికి పేటీఎం ఇన్సూరెన్స్‌ను ఇస్తోంది
PAYTM యూజర్స్ కి ఒక గుడ్ న్యూస్ ,పేటీఎం ఇన్సూరెన్స్‌ను ఇస్తోంది. వాలెట్ వున్న మనీ మరియు వాలెట్ యాప్ కలిగి వున్న ఫోన్ పోయినట్లయితే దానికి పేటీఎం ఇన్సూరెన్స్‌ను ఇస్తోంది.నిన్నటినుంచి దీనిని పేటీఎం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు . ఎంతమందయితే యూజర్స్ పే టీఎం వాడుతున్నారో వారందరు ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
ఈ ఇన్సూరెన్స్ ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే (పేటీఎం కస్టమర్ కేర్ నంబర్ +91 9643 979797) ఫోన్ పోయిన వాలెట్ లో డబ్బు పోయిన ఈ నెంబర్ కు 24 గంటలలోపు కంప్లెయింట్ చెయ్యాలిసి ఉంటుంది. డివైస్ పోతే యూజర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా రిజిస్టర్ చేయించాలిసి ఉంటుంది. తదనంతరం PAYTM ఆ కంప్లెయింట్ యాక్సెప్ట్ చేసి 5 డేస్ లోనే దొంగిలించబడిన మనీ యూజర్ వాలెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
ఆ కంప్లెయింట్ యాక్సెప్ట్ చేసి 5 డేస్ లోనే దొంగిలించబడిన మనీ యూజర్ వాలెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
కానీ అన్ని డిటైల్స్ పరిపూర్ణం గా ఎంక్వయిరీ చేసిన తరువాతే పేటీఎం డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ లోపు యూజర్ యొక్క పేటీఎం వాలెట్ 5 రోజుల పాటు బ్లాక్ అవుతుంది.ఆ తరువాత కొత్త పాస్ వర్డ్ ఇస్తుంది. దాంతో యూజర్ మళ్లీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే లాస్ అయిన మనీ తిరిగి పొందే అవకాశం వుంది. పేటీఎం రూ.20వేల వరకు మాత్రమే యూజర్‌కు అందిస్తుంది.