My Jio ఆప్ ని కొత్త అప్డేట్ తో 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజి అందుకోండి
కొత్త "మై జియో ఆప్ " యొక్క వెర్షన్ 5.0.27 ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెలికాం సంస్థ రిలయన్స్ జియో, తన My Jio App కోసం కొత్త అప్‌డేట్ అందించింది. ఈ ఆప్, ఇప్పుడు జియో క్లౌడ్ ఇంటిగ్రేషన్‌తో అప్డేట్ చెయ్యబడింది. ఈ క్లౌడ్ యాక్సెస్ ద్వారా, వినియోగదారులు వారి ఫోటోలు, ఫైల్స్, వీడియో కంటెంట్‌ను Live గా మైజియో ఆప్ లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ జియో క్లౌడ్ అప్లికేషన్ Android మరియు iOS కోసం కూడా అందుబాటులో ఉంది మరియు మీరు దాని వెబ్ వెర్షన్‌ను కూడా పొందవచ్చు.
ఈ అప్డేట్ తరువాత, వినియోగదారులు ఇప్పుడు మై జియో యాప్ ద్వారా JioTune కు కూడా యాక్సెస్ అందుకుంటారు. ఈ అప్డేట్ తర్వాత, జియో వినియోగదారులు తమ జియో ట్యూన్‌లను సెట్ చేయవచ్చు, వినవచ్చు మరియు తీసివేయవచ్చు. రిలయన్స్ జియో యొక్క ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల కోసం ఈ అప్డేట్ My Jio App యొక్క ప్రత్యేక జియో క్లౌడ్ విభాగం అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల కోసం, ఈ అప్డేట్ లో 5 GB క్లౌడ్ స్టోరేజిని కూడా అందించింది.
అప్డేట్ డౌన్‌లోడ్
ANDROID వినియోగదారులు Google Play నుండి అప్డేట్ అయినా కొత్త "మై జియో ఆప్ " యొక్క వెర్షన్ 5.0.27 ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, మీరు iOS వినియోగదారులయితే, మీరు యాప్ స్టోర్ నుండి సరికొత్త వెర్షన్ 5.0.11 ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సివుంటుంది. అటు తరువాత, ఈ నవీకరణ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.