ఆండ్రాయిడ్ ఫోనులకు గూగల్ మ్యాప్స్ offline మోడ్ లో కొన్ని అదనపు ఆప్షన్స్ యాడ్ చేసి కొత్త అప్ డేట్ రిలీజ్ చేసింది. అయితే సొంత ఊరిలో ఉంటున్న వారికీ మ్యాప్స్ పెద్దగా ఉపయోగం ఉండదు.
కేవలం ఉద్యోగ రిత్యా లేదా కొత్త ప్రదేశాలలో ఉన్నపుడే దీని ఉపయోగం ఎక్కువుగా ఉంటుంది. సో మీకు అనవసరం అనిపిస్తే ఈ యాప్ ను uninstall చేసుకోవటం మంచిదే.
మీకు తెలియకుండా ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ use అయ్యే అవకాశాలున్నాయి. సరే కొత్త ఆప్షన్స్ విషయానికి వస్తే, WiFi Only mode అనే ఆప్షన్ ఒకటి యాడ్ అయ్యింది.
దీనితో పాటు offline మాప్స్ ను SD కార్డ్ లో కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం వస్తుంది ఇప్పుడు. ఇది enable చేయటనికి.. Menu > Offline areas > Settings > Storage preferences>device లోకి వెళ్ళాలి.
WiFi only mode అనేది ఇంటర్నెట్ మరియు బ్యాటరీ save చేసేందుకు కేవలం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆఫ్ లైన్ మ్యాప్ నుండి మ్యాప్స్ ను వినియోగించేలా చేస్తుంది. ఇవి iOS లో ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు ఇంకా.