వాట్స్ అప్ మెసెంజర్ లో GIF ఇమేజెస్ సపోర్ట్ యాడ్ అయ్యింది. అయితే ఇది అందరికీ కాదు. బీటా users కు మాత్రమే అప్ డేట్ రోల్ అయ్యింది.
బీటా tester అవ్వటానికి ఏమి చేయాలి?
beta tester అంటే అందరికన్నా ముందుగా మీకు వాట్స్ అప్ అప్డేట్స్ వస్తాయి. మీరు అప్ డేట్ చేసుకొని యాప్ ను వాడి వాటిలో ఏమైనా బగ్స్ ఉంటే అవి కంపెని కు వెళ్తాయి. అంతే! అయితే ఇంస్టాల్ చేసుకున్న ప్రతీ beta వెర్షన్ లో బగ్స్ ఉండవు 95 పెర్సెంట్. అలాగే beta ఇంస్టాల్ చేసుకున్న ప్రతీ ఒక్కరూ బగ్స్ రిపోర్ట్ చేయాలనీ ఉండదు.
ఈ లింక్ లోకి వెళ్లి beta testing కు అప్లై చేయండి. సింపుల్ ప్రోసెస్. ఇక్కడ enable అయిన తరువాత ప్లే స్టోర్ లో ఆటోమాటిక్ గా మీకు beta అప్ డేట్స్ వస్తాయి. ఇవి beta tester అప్లై చేయని వారికీ రావు. late గా వస్తాయి.
GIF అంటే – మూవింగ్ ఇమేజెస్. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ నోకియా ఫోనుల నుండి ఆండ్రాయిడ్ రాకముందు నుండి ఉన్నాయి. కాని అప్పట్లో ఆండ్రాయిడ్ లో GIF సపోర్ట్ లేకపోవటం వలన ఇవి మరలా కొంతకాలం దూరం అయ్యాయి.
basically వాట్స్ అప్ లో ఉన్న GIF ఫీచర్ అనేది ఒక వీడియో లోని మాక్సిమమ్ 6 సేకేండ్స్ క్లిప్ ను GIF ఇమేజ్ గా మారుస్తుంది. 2.16.242 to 2.16.244 beta వెర్షన్స్ లో ఇది ఉంది. iOS కు ఇంకా రాలేదు. ఆండ్రాయిడ్ కు మాత్రమే ఈ అప్ డేట్ రిలీజ్ అయ్యింది.
ఎక్కడ ఉంది వాట్స్ అప్ లో…
చాట్ స్క్రీన్ పైన అటాచ్ మెంట్ ఐకాన్ పై టాప్ చేస్తే మీకు రికార్డ్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇదే GIF కన్వర్షన్ ఇమేజ్. 1 నుండి 6 సెకెండ్స్ పాటు రికార్డ్ చేసిన తరువాత ఆ వీడియో ను trim చేయటానికి top రైట్ సైడ్, camcorder ఐకాన్ తో మరొక విండో వస్తుంది. దీనిపై టాప్ చేయగానే రికార్డ్ చేసిన వీడియో… GIF ఇమేజ్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పటికప్పుడు రికార్డింగ్ అనే కాకుండా ఆల్రెడీ మీ ఫోన్ లో ఉన్న వీడియోస్ పైన కూడా పనిచేస్తుంది. అవతల వ్యక్తికి GIF ఇమేజ్ గా వెళ్తుంది. అయితే 6 సేకేండ్స్ కన్నా తక్కువ ఉన్న వీడియోస్ కు మాత్రమే gif కన్వర్షన్ సపోర్ట్ ఉంటుంది.
అయితే ఇవి GIF ఇమేజెస్ నా లేక వీడియో trimming నా?
మీరు ఎవరికైనా పైన చెప్పిన పద్దతిలో పంపిస్తే, వారికీ వాట్స్ అప్ లో gif ఇమేజ్ వచ్చింది అని నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది gif అనే అనుకోవాలి. కాని బ్యాక్ గ్రౌండ్ లో వీడియో trimming చేసి produce చేస్తుంది ఫైల్ ను. ఫోన్ స్టోరేజ్ లో కూడా .mp4 ఫార్మాట్ లోనే సేవ్ అవుతున్నాయి.