ఆండ్రాయిడ్ OS లో GIFpics & సర్చ్ ఫీచర్స్ తో గూగల్ కీ బోర్డ్ యాప్ లాంచ్

Updated on 13-Dec-2016
HIGHLIGHTS

ఇది ఇంకా ప్లే స్టోర్ లో లిస్టు అవ్వలేదు కానీ మీరు లోపల తెలిపిన డౌన్లోడ్ లింక్ ద్వారా ఇంస్టాల్ చేసుకోగలరు.

గూగల్ కీ బోర్డ్ అందరికీ తెలిసిన యాప్. కాని గూగల్ GBoard అనే పేరుతో ఐ OS ఫోన్లకు సరికొత్త కీ బోర్డ్ యాప్ రిలీజ్ చేసిందని ఎక్కువ మందికి తెలియదు.

ఇప్పుడు ఈ యాప్ ను ఆండ్రాయిడ్ OS కు కూడా తీసుకువచ్చింది గూగల్. అయితే ప్రస్తుతానికి ప్లే స్టోర్ లో ఇంకా లిస్టు అవ్వలేదు..

కానీ మీరు try చేద్దామని అనుకుంటే ఈ లింక్ లోకి వెళ్లి apk mirror సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసి వాడుకోగలరు.

ఏంటి ఈ Gboard లోని ప్రత్యేకతలు?

  • ఇది Gif images సపోర్ట్ తో వస్తుంది. అయితే GIF ఇమేజెస్ ను సపోర్ట్ చేయని యాప్ లో GIF ఫీచర్ కనిపించదు.
  • కీ బోర్డ్ లో గూగల్ సర్చ్ ఉంటుంది.
  • తెలుగు అక్షరాలతో తెలుగు టైపింగ్ సపోర్ట్
  • రెగ్యులర్ dedicated నంబర్స్ row, gesture టైపింగ్
  • కీస్ వెనుక బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ కూడా మార్చుకోగలరు.

 

GIF ఫీచర్ పొందటానికి రైట్ బాటం చివరిలో ఉండే కలర్ arrow/సర్చ్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేసి smiley సింబల్ పైకి స్వైప్ చేస్తే అడుగున ఉంటుంది.

ఇక గూగల్ సర్చ్ కారణంగా చాలా ఈజీగా పనులు అందుకోగలరు users. అంటే చాటింగ్ చేస్తుంటే అన్ని అక్కడకి అక్కడే సర్చ్ చేసి అవతల వ్యక్తులకు షేర్ చేయగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :