Times Internet వారిచే నడపబడుతున్న Gaana.com, పాపులర్ ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు హ్యాక్ అయ్యింది. యూజర్స్ లాగిన్ పాస్వర్డ్స్ అన్ని అందరికి విసిబుల్ గా ఉన్నాయి. Gaana సర్వీసు ఆండ్రాయిడ్ ఆప్ రూపంలో బాగా ఫేమస్. మీరు కనుక Gaana సర్వీసుకు యూస్ చేసిన పాస్వర్డ్ ను ఇతర సర్వీసులకు ఉపయోగిస్తున్నట్లు అయితే, వెంటనే మార్చుకోండి. లేదంటే ప్రైవెసి ఇబ్బందులు తప్పవు.
ప్రస్తుతం సైటు ఓపెన్ చేస్తుంటే మెంటేనన్స్ లో ఉంది అని మేసెజ్ చూపిస్తుంది. హ్యాకర సైటు యూజర్స్ డిటేల్స్ అన్ని అందరికి కనపడేలా తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో పోస్ట్ చేయటం జరిగింది. కొన్ని కారణాల వలన మేము ఇక్కడ ఆ లింక్ ను పోస్ట్ చేయలేము. కాని గానా ప్రీమియం సర్వీసును కొన్న యూజర్స్ సెక్యూర్ బ్యాంకింగ్ డేటా హ్యాక్ అవలేదని సమాచారం. యూజర్స్ డిటేల్స్ తో పాటు బ్యాక్ ఎండ్ వెబ్ సైటు డిటేల్స్ కూడా హ్యాకింగ్ కు గురయ్యాయి.
SQL ఇంజెక్షన్ సహాయంతో హ్యాక్ చేసిన హ్యాకర్ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా తెలిసిన విషయం, హ్యాకర్ లాహోర్, పాకిస్తాన్ దేశస్తుడు. ప్రస్తుతం Gaana సీఈఓ సైటు హ్యాక్ అయినందు వలన వాళ్ళ సైటు లో రిజిస్టర్ అయిన యూజర్స్ అందరిని రిసేట్ చేయనున్నారని ట్విట్టర్ లో వెల్లడించారు. దీని వలన గానా యూజర్స్ డిటేల్స్ అన్ని ఎరెజ్ అయిపోతాయి.
https://twitter.com/satyangajwani/status/603875251173359616