ఇండియాలో డిజిటల్ కరెన్సీ పరిస్థితిలు రావటంలో wallet కంపెనీలు అన్నీ వివిధ రకాల ఆఫర్స్ అందిస్తున్నాయి. లేటెస్ట్ గా ఫ్రీ చార్జ్ వాల్లేట్ e-wallet ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తుంది.
ఇది అందరికీ ఫ్రీ. అకౌంట్ ఉంటె చాలు, సెపరేట్ సెట్టింగ్స్ ఏమి చూడనవసరం లేదు. ఇందుకు రిలయన్స్ జనరల్ ఇన్సురన్సు కంపెని తో ఒప్పందం కుదుర్చుకుంది freecharge.
అది సరే ఏంటి ఇది, ఎలా పనిచేస్తుంది?
మీ ఫోన్ పోయినా, వాల్లేట్ లో మనీ హాక్/fraud activities జరిగినా లేదా ఏదైనా టెక్నికల్ తప్పిదాల ద్వారా మీ cashless డిజిటల్ మనీ ను పోగొట్టుకుంటే మీ wallet లోని నగదు బట్టి మీకు 20,000 రూ వరకూ భీమా ఇస్తుంది freecharge.
నా ఫోన్ లో ఫ్రీ చార్జ్ వాల్లెట్ ఇంస్టాల్ చేసి ఉంది, అదే ఫోన్ పోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది భీమా?
12 గంటల్లోపు ఫ్రీ చార్జ్ కు మెయిల్(care@freecharge.com) ద్వారా తెలియజేస్తే కంపెని రెండు గంటల్లోపు అకౌంట్ ను deactivate చేస్తుంది. ఆ తరువాత దగ్గరిలోని పోలిస్ స్టేషన్ లో ఫోన్ పోయినట్లు 24 గం ల్లోపు FIR రిజిస్టర్ చేసి దానిని freecharge కు మెయిల్ చేస్తే మీకు wallet లో ఉన్న నగదు బట్టి అన్నీ వెరిఫై చేసిన తరువాత ఆ ఫోన్ తో లింక్/ఇంస్టాల్ అయిన వాల్లెట్ లో ఉన్న అమౌంట్ ను భీమా పొందుతారు.
అయితే నెలకు కనీసం ఒక్కసారి అయినా freecharge వాల్లేట్ ద్వారా పేమెంట్ చేయాలి భీమా పొందటానికి. ఇన్సురన్సు ప్లాన్ పై మరిన్ని డౌట్స్ కు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.