మీరు ఫోన్ లో ఫేస్ బుక్ మెసెంజర్ ఉందా? అయితే ముందు దానిని లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోండి ప్లే స్టోర్ లో. తరువాత మెసెంజర్ ఓపెన్ చేసి, ఎవరికైనా మెసేజ్ పంపటానికి విండో ఓపెన్ చేయండి. ఇప్పుడు emojis పై టాప్ చేయండి.
emojis వేరు stickers వేరు. confuse అవ్వకండి. Write a message అని కనిపిస్తున్న వరసులో రైట్ సైడ్ like సింబల్ ప్రక్కన ఉన్నది emojis సెక్షన్. ఇప్పుడు వాటి పై టాప్ చేస్తే మీకు టాప్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో ఫుట్ బాల్ సింబల్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేయగానే అవతల వ్యక్తికీ వెళిపోతుంది సింబల్.
ఇప్పుడు send అయిన ఫుట్ బాల సింబల్ పై టాప్ చేయండి. మీకు ఫుట్ బాల గేమ్ ఓపెన్ అవుతుంది. అయితే ఇది బేసిక్ ఫుట్ బాల గేమ్. మరలా ఎదో గ్రాఫికల్ high end గేమింగ్ ఉంటుంది అని అనుకోకండి.
గేమ్ ఏలా ఆడాలి?
జస్ట్ మీరు ఆ బాల్ పై టాప్ చేస్తూ ఉండాలి క్రింద పడకుండా. ఈజీ కాదు. స్కోర్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ టైమ్ కిల్లింగ్ ఎవరి కోసమైనా వేయిటింగ్స్ చేస్తున్నప్పుడు. సెపరేట్ గా గేమ్ ఇంస్టాల్ చేసుకోనవసరం లేదు కదా!
మరొక ఫేస్ బుక్ మెసెంజర్ టిప్: మీరు ఏదైనా text, ఇమేజ్, ఫైల్, resume, వీడియో వెంటనే స్టోర్ చేయాలన్నా లేదా future లో మరిచిపోకుండా refer చేసుకునేందుకు ఫేస్ బుక్ మెసెంజర్ బాగా useful.
జస్ట్ మీరు డెస్క్ టాప్ లో అయినా, యాప్ లో అయినా చాట్ సర్చ్ లో మీ పేరు టైప్ చేయండి. మీ చాట్ విండో మీకే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీరే ఇంపార్టెంట్ డేటా వంటివి సెండ్ చేసుకోండి. అంతే!
ఫేస్ బుక్ అయితే ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. సో ఈజీగా access చేయగలరు మీకు అవసరం అయినప్పుడు. అలాగే కొన్ని సార్లు సేవ్ చేసినవి కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది. అలా మరిచిపోకుండా కూడా ఉంటుంది. ఎప్పుడూ ఫేస్ బుక్ లోనే ఉంటాము కదా. ఎవరితో చాట్ చేద్దామన్న చాట్స్ లో మన పేరుతో ఉన్న చాట్ విండో కనిపిస్తుంది.
మరొక విషయం ఇప్పుడు fb మేసేజర్ స్టాండర్డ్ sms మెసేజింగ్ యాప్ గా కూడా పనిచేస్తుంది. ఒక్కప్పుడు ఈ ఫీచర్ ను ఇచ్చి మరలా రిమూవ్ చేసింది. అప్పుడు మెసెంజర్ ను ఫేస్ బుక్ నుండి విడదీసి సెపరేట్ యాప్ గా చేసినందుకు జనాలు కోపంగా ఉన్నారు. కాని అన్నీ మరిచిపోయారని మళ్ళీ ప్రవేసపెట్టింది సేమ్ ఫీచర్ ను. జస్ట్ మీ ఫోన్ మనీ బ్యాలన్స్ నుండి డబుల్లు కట్ చేసుకునే పంపుకునే sms ఏ. ప్రత్యేకం ఏమి లేదు. కలిపింది అంతే!