ఫ్లిప్ కార్ట్ Myntra షాపింగ్ సైటు కొన్న వెంటనే, దానిని కేవలం అప్లికేషన్ నుండి మాత్రమే యూజ్ చేసేందుకు పరిమితం చేసింది. అయితే ఆ మార్పు మంచి రిసల్ట్స్ ను ఇచ్చినట్టుంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ యాప్ కూడా డెస్క్టాపు లో కనుమరుగు అవనుంది.
ఫ్లిప్ కార్ట్ CEO, పునిత్ సోని, లాస్ట్ వీక్ employees అందరినీ టౌన్ హాల్ లో మీటింగ్ కు రమ్మని, ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి ఫ్లిప్ కార్ట్ సర్వీస్ కేవలం యాప్ రూపంలోనే అందనుంది అని తెలియజేసినట్టు రిపోర్ట్స్.
గతంలో కూడా కంపెని, వివిధ సందర్భాలలో అప్లికేషన్ నుండి వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ ను ఎక్కువుగా వాడుతున్నారని వెల్లడించింది. 70 శాతం యూజర్స్ యాప్ ను వినియోగిస్తున్నారు. తాజగా యాప్ లో ఇమేజ్ సర్చింగ్ ఆప్షన్ ను కూడా యాడ్ చేశారు.
ఇది కనుక ఈ సంవత్సరం సెప్టెంబర్లో వాస్తవ రూపంలోకి వస్తే, యాప్ మార్కెట్ ఎంత విపరీతమైన డిమాండ్ లో ఉందో అనే విషయం అందరికీ స్పష్టం అవుతుంది లేదా ఫ్లిప్ కార్ట్ అయినా కొత్త గుణపాఠం నేర్చుకుంటుంది. ప్రాక్టికల్ గా అయితే, బట్టలు, స్మార్ట్ గాడ్జెట్స్ వంటివి ఎక్కువసేపు కంఫర్ట్ గా పెద్ద స్క్రీన్స్ పై చూసుకుంటే కాని బయర్స్ కొనటానికి ఇష్టపడరు.