ఇ కామేర్స్ దిగ్గజం, ఫ్లిప్ కార్ట్ త్వరలో 'ఇమేజ్ సర్చ్' ఫీచర్ ను మొబైల్ యాప్ లో తిసుకు రానుంది. ప్రస్తుతం ఇది బీటా లో ఉంది. ఫోటో తో ప్రొడక్ట్స్ ను వెతుకుతుంది. ఇది గూగల్ ఇమేజ్ సర్చ్ వంటిది అన్న మాట.
మీరు ఒక ఫోటో చూపించి, దానిపై క్లిక్ చేస్తే, అలాంటి ప్యాటర్న్ మరియు స్టైల్ ఉన్న ఇమేజెస్ ను చూపిస్తుంది. ఫ్లిప్ కార్ట్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్, పునిత్ సోని ప్రకారం, యూజర్స కు రకరకాల అభిరుచులు ఉంటాయి. వాటిని Categories ద్వారా satisfy చేయటం కష్టం. అలాగే చాలా వరకూ ఫేషన్ కొనుగోలు నిర్ణయాలు, సిమిలర్ ప్రొడక్ట్స్ మీద ఆధార పడి ఉంటుంది. సో ఈ ఇమేజ్ సర్చ్ ఫీచర్ ఇలాగ సిమిలర్ ప్రోడక్ట్లను వెతికి సర్చింగ్ చేసే టైమ్ ను సేవ చేసి మీ అభిరుచుకి తగ్గా ఐటం లను వెంటనే వెతికి ఇస్తుంది.
ఫ్లిప్ కార్ట్ గతంలో తమ వినియోగదారులలో 70 శాతం మంది మొబైల్ యూజర్స్ అని చెప్పింది. అందుకే కంపెని కూడా మొబైల్ ఫీచర్స్ పై ఎక్కువ శ్రద్ధగా ఉంది. ఈ కొత్త ఫీచర్ యూజర్స్ కు నచ్చి సక్సెస్ అయితే, ఇది మొట్ట మొదటిగా ఫ్లిప్ కార్ట్ లోనే వస్తున్న ఆప్షన్ కనుక కంపెని కు మరింత ఉపయోగపడుతుంది.
ఫ్లిప్ కార్ట్ ను గూగల్ ఇమేజ్ సర్చ్ algorithms నే వాడనుందా అని అడిగాము, త్వరలోనే దానికి వాళ్లు సమాధానం ఇస్తే అప్ డేట్ చేస్తాము. ఎందుకంటే ఇమేజ్ సర్చ్ రియల్ టైమ్ గూగల్ సైతం సక్సెస్ చేయలేకపోయింది. గూగల్ లో కూడా మీరు టెక్స్ట్ సర్చింగ్ మాత్రమే కాకుండా మీ దగ్గర ఉన్న ఇమేజ్ తో అలాంటి మరో ఇమేజ్ ను సర్చ్ చేయగలరు. ఈ లింక్ లో గూగల్ ఇమేజ్ సర్చ్ కు వెల్లగలరు.