Flipkart Money పేరుతో ఫ్లిప్ కార్ట్ నుండి కొత్త యాప్ సర్వీస్ లాంచ్ అయ్యింది. ఇది ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ ఫ్లిప్ కార్ట్ యాప్స్ లోనే కనిపిస్తుంది. 10,000 రూ వరకూ స్టోర్ చేయగలరు wallet లో.
ఇది ఏమి చేస్తుంది?
ప్రత్యేకంగా కొత్త విషయం ఏమి లేదు, ఫ్లిప్ కార్ట్ లో మీరు ఐటమ్స్ ను కొనటానికి డైరెక్ట్ బ్యాంక్ నుండి అమౌంట్ transaction చేయకుండా ముందు wallet లో వేసుకొని ఐటమ్స్ ను కొనగలరు.
దీనిలో ఉన్న ఉపయోగం ఏమిటంటే మీరు ఐటెం ను రిటర్న్ చేస్తే అమౌంట్ చాలా త్వరగా refund అవుతుంది wallet లోకి. గిఫ్ట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ డిటేల్స్ కూడా సేవ్ చేయగలరు.
ఇది కంపెని వెబ్ సైట్ లో కూడా కనిపిస్తుంది కాని అక్కడ కేవలం డిటేల్స్ మాత్రమే చూడగలరు. ఫంక్షన్స్ ఏమీ లేవు. ఫ్లిప్ కార్ట్ మనీ wallet నుండి బ్యాంక్ కు కూడా మీరు మనీ ట్రాన్స్ ఫర్ చేయగలరు.
అయితే ఈ ఫీచర్స్ అన్ని మేజర్ wallets – Paytm, Mobikwik అండ్ Freecharge లో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాప్ ఓపెన్ చేసి పైన రైట్ కార్నర్ లో కనిపించే వెర్టికల్ డాట్స్ పై క్లిక్ చేసి My Account లోకి వెళ్తే My wallet కనిపిస్తుంది.
wallet పై కంప్లీట్ డౌట్స్ అన్నీ ఈ లింక్ లో క్లారిఫై చేసుకోగలరు.