ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను మొబైల్ లో యాక్సిస్ చేయటానికి users ను ఎంత ఫోర్స్ చేస్తుందో సెపరేట్ గా చెప్పనవసరం లేదు, ఫ్లిప్ కార్ట్ ను డెస్క్ టాప్ లో యాక్సిస్ చేసిన వారికీ బాగా తెలుసు ఇది.
అయితే మొబైల్ లో కూడా బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేది కాదు, డైరెక్ట్ యాప్ ఉంటేనే పని చేసేది. మొబైల్ బ్రౌజర్ లోకి వెళితే డౌన్లోడ్ యాప్ అని మాత్రమే చూపించేది.
ఇప్పుడు, యాప్ లేకపోయినా మొబైల్ లో బ్రౌజర్ ద్వారా కూడా ఫ్లిప్ కార్ట్ ను యాక్సిస్ చేసేందుకు ఒప్పుకుంది. మిగిలిన వెబ్ సైట్ల కాంపిటీషన్ కారణంగా ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం కు వచ్చింది.
దానికి తోడూ గూగల్ సర్చ్ లో కూడా App Only ఐడియా కారణంగా ఫ్లిప్ కార్ట్ ప్రొడక్ట్స్ అస్సలు ఏమీ ట్రాక్ అవటం లేదు. గూగల్ సర్చ్ ఇంజిన్ యాప్ కంటెంట్ ను , ఇండెక్స్ ను డైరెక్ట్ చేయలేదు. ఇండియన్ ఇంటర్నెట్ స్పీడ్ లను దృష్టిలో పెట్టుకొని అయినా ఈ పని ముందే చేసి ఉండాలిసింది ఫ్లిప్ కార్ట్.
గూగల్ క్రోమ్ అండ్ ఒపేరా తో కలిసి మొదటి సారిగా Lite మొబైల్ షాపింగ్ వెబ్ సైట్ ను స్టార్ట్ చేస్తుంది ఫ్లిప్ కార్ట్. డేటా ను కంప్రెస్ చేసి పేజెస్ ను ఫాస్ట్ గా లోడ్ చేస్తుంది. త్వరలో మొజిల్లా తో కూడా కలవనుంది.
అంటే డేటా కోసం ఫ్లిప్ కార్ట్ సర్వర్ వెబ్ సైట్ కు వెళ్ళకుండా మొబైల్ ప్రొసెసర్ పైనే ఎక్కువ గ్రాఫిక్స్ dependency అవుతాది Lite. దీని వలన వెబ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఆఫ్ లైన్ రిటేల్ స్టోర్స్ మోడల్ పై కూడా వర్క్ చేస్తుంది. అంటే ఫోన్ కొనే ముందు దానిని కొన్ని ఫ్లిప్ కార్ట్ స్టోర్స్ కు వెళ్లి, ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.