ఫ్లిప్ కార్ట్ షాపింగ్ యాప్ లో పింగ్ అనే కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఇది ఫ్రెండ్స్ తో కలిసి బయట షాపింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. కంపెని లెక్కలు ప్రకారం 41 శాతం ఆన్ లైన్ షాపింగ్ షాపింగ్ కేవలం మొబైల్ నుండే జరుగుతుంది.
పింగ్ మెయిన్ పాయింట్, మీరు షాపింగ్ చేస్తున్న వస్తువును ఫ్రెండ్స్ కు షేర్ చేయటం, చూపించటం, నిర్ణయాలు అడగటం వంటి పనులు చాలా సునాయాసంగా చేసుకునే వీలు ఇస్తుంది.
మీరు షాపింగ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇమేజ్, లింక్, కార్ట్ వంటివి అన్నీ షేర్ చేయగలరు. దీనికి తోడూ షాపింగ్ చేస్తూ ఏదైనా ఐటెం గురించి అభిప్రాయాలు అడగటానికి మరో చాటింగ్ అప్లికేషన్ లాంచ్ చేసే అవసరం లేకుండా ఫ్లిప్ కార్ట్ లోనే చాటింగ్ కూడా చేసుకోవచ్చు.
సోషల్ నెట్ వర్కింగ్ ఇంటిగ్రేషన్ అండ్ ఫోన్ లోని కాంటాక్ట్ ల నుండి ఫ్రెండ్స్ నంబర్స్ ను యాక్సిస్ చేసి ఈ ఆప్షన్స్ ను అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది invite రూపంలోనే వస్తుంది. జస్ట్ ప్లే స్టోర్ లో కొత్తగా వచ్చిన అప్ డేట్ ను ఇంస్టాల్ చేసి, ఓపెన్ చేయండి, పింగ్ అనే ఫీచర్ గురించి పాప్ అప్ వస్తుంది, దానిపై ప్రెస్ చేస్తే త్వరలో మీకు invite అందుతుంది అని చెబుతుంది.
లేదు వెంటనే కావాలంటే ఆల్రెడీ ఈ ఫీచర్ ను వాడుతున్న ఫ్రెండ్ ను రిక్వెస్ట్ చేయగలరు. ఫ్లిప్ కార్ట్ నుండి ఎవరికైనా ఒక invite వస్తే దాని ద్వారా 10 మందికి invite పంపగలరు. ఇదే అప్ డేట్ ద్వారా 2MB సైజ్ పెరిగింది యాప్ కు. అలాగే తక్కువ డేటా ను వాడేలా డిజైన్ చేసారు. ఇది ఇండియన్ మార్కెట్ లో 2g ఇంటర్నెట్ ను వాడుతున్న వారిని దృష్టి లో పెట్టుకొని స్పెషల్ గా తీసుకున్న నిర్ణయం.
ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ వాడుతున్న ఫ్రెండ్స్ తోనే చాటింగ్ చేసుకునే ఫీచర్ ఉంది, త్వరలో ప్రోడక్ట్ ను అమ్ముతున్న సెల్లెర్స్ తో కూడా యూజర్స్ చాట్ చేసుకునే ఫీచర్ పై పనిచేస్తుంది ఫ్లిప్ కార్ట్ యాప్. ఇంకో విషయం త్వరలో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటు ను కూడా మూసివేయనుంది. కేవలం యాప్ లోనే అన్నీ అందిస్తుంది. అందుకే వారానికి ఒక కొత్త ఫీచర్ ను యాడ్ చేస్తుంది ఫ్లిప్ కార్ట్ అప్లికేషన్ కు.