బ్రేకింగ్ న్యూస్ కోసం ఫేస్ బుక్ కొత్త అప్లికేషన్
By
Ajit Singh |
Updated on 15-Oct-2015
HIGHLIGHTS
నోటిఫికేషన్స్ ద్వారా సమాచారం ఇస్తుంది.
ఫేస్ బుక్ బ్రేకింగ్ న్యూస్ యాప్ ను డెవలప్ చేస్తుంది. దీని పేరు 'Notify' అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది అక్టోబర్ చివరికి రిలీజ్ అవుతుంది అని అంచనా.
The Awl రిపోర్ట్స్ ప్రకారం ఫేస్ బుక్ ప్రస్తుతం ఈ యాప్ ను టెస్ట్ చేస్తుంది. దీని సంబందించిన స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ అయ్యాయి.
ఇమేజెస్ చూస్తే.. users కు వాళ్ళకు నచ్చిన న్యూస్ పబ్లిషర్స్ కు సబ్స్ స్క్రైబ్ అవగలరు అని తెలుస్తుంది. న్యూస్ పబ్లిషర్స్ ను ఫేస్ బుక్ stations అని పిలుస్తుంది. వీటి క్రింద సబ్ స్టేషన్స్ కూడా ఉంది.
ఫేస్ బుక్ న్యూస్ యాప్ పై పనిచేస్తున్నట్టు గతంలోనే రిపోర్ట్స్ వచ్చాయి. మొదటిగా కేవలం 100 కేరక్టర్స్ లోనే న్యూస్ ఇస్తుంది. ఇది ట్విటర్ లో రీసెంట్ గా వచ్చిన moments ఆప్షన్ కు పోటీ ఇస్తుంది అని అంచనా.