ఫేస్బుక్ మెసెంజర్ లేటెస్ట్ అప్డేట్ ద్వారా ఫేస్బుక్ ఏకౌంట్ లేకపోయినా మెసెంజర్ ను వాడుకునే సదుపాయం కల్పిస్తుంది. ప్రస్తుతం US, కెనెడా తదితర దేశాలలో అమల్లో ఉన్న ఈ అప్డేట్ త్వరలో మనకి రానుంది.
డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, "Not on Facebook" ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ తో సైన్ అప్ అవచ్చు మెసెంజర్ లోకి. అయితే ఏకౌంట్ తో సంబంధం లేకుండా ఇలా మెసెంజర్ ను ఏక్సిస్ చేయటం అనేది ఎక్కువ శాతం యూజర్స్ కు అవసరం లేనిది, ఎందుకంటే ఫేస్బుక్ ఏకౌంట్ లేని వారు చాలా రేర్.
కాని ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళకి, fb లో ని వారి ఫ్రెండ్స్ తో మాట్లాడటానికి ఇక ఫేస్బుక్ అవసరం లేదు. జస్ట్ వాళ్ల స్నేహితుల ఫోన్ నంబర్లు తెలిస్తే చాలు. యూజర్ కాంటాక్ట్ లిస్టు ను ఏక్సిస్ చేసి, ఆ ఫోన్ నంబర్స్ తో ఫేస్బుక్ లో ఎవరు ఉన్నారు అని వెతికి, అనుసంధానం చేసి చాటింగ్ కు అనుమతిస్తుంది ఈ కొత్త అప్డేట్. మెసెంజర్ ప్రస్తుతం వాయిస్, వీడియో మరియు మనీ ట్రాన్సఫరింగ్ (US లో మాత్రమే ) ఆప్షన్స్ ను ఇస్తుంది. ఇప్పటికే దీనికి 1.44 బిలియన్ యూజర్స్ ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ దించిన అన్ని కొత్త ఫీచర్స్ మరొకటి ఏదీ దించలేదు. ఇంతకముందే మీ కంప్యూటర్ లో ఉన్న మాల్వేర్ డిలిట్ చేసేందుకు కొత్త రిమూవల్ టూల్ ను Kaspersky తో కలిసి తయారు చేసింది.