ఫేస్ బుక్ నిన్న రియాక్షన్స్ పేరుతో కొత్త ఫీచర్ యాడ్ చేసింది ఫేస్ బుక్ లో. ఇది ఆల్రెడీ పనిచేస్తుంది కూడా. reactions అంటే Like తో పాటు అదనంగా ఉండే ఫీచర్.
ఎవరి పోస్ట్ కు అయిన Like తో పాటు happy, sad, wow ఇంకా మరిన్న రియాక్షన్స్ ను తెలియచేయటానికి use అవుతుంది. దీని గురించి నిన్నసింగిల్ లైన్ అప్ డేట్స్ లో ఆల్రెడీ తెలియజేయటం జరిగింది.
ప్రస్తుతానికి ఇండియాలో కూడా పని చేస్తుంది కాని కేవలం డెస్క్ టాప్ పైనే. మొబైల్ ఫేస్ బుక్ కు కంపెని ఫీచర్ ను రిలీజ్ చేసింది కాని అది దశల వారిగా వస్తుంది. మీకు లేకపోయినా కంగారు పడకండి.
సో ప్లే స్టోర్ లో కాని ఆపిల్ స్టోర్ లో కాని ఫేస్ బుక్ కు అప్ డేట్ వచ్చిందేమో చూడండి. వెర్షన్ నంబర్ 65.0.0.42.81 లో లేటెస్ట్ అప్ డేట్ ఉంది కాని దీనిలో కూడా reactions లేదు.
పోస్ట్ క్రింద LIKE బటన్ పైకి వెళ్లి 1 sec పాటు mouse cursor ను ఉంచితే మీకు రియాక్షన్స్ కనపడతాయి. అలాగే మీరు పెట్టిన పోస్ట్లకు రియాక్షన్స్ చూడాలంటే సింబల్స్ కనిపిస్తాయి, వాటి పై క్లిక్ చేస్తే ఎవరూ పెట్టారు అనేది చూడగలరు.