ఇంతకముందు ఫేస్బుక్ లైట్ యాప్ లాంచ్ అయినట్లు మీరు చదివారు, అయితే అది ఇతర దేశాలలో, ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది ఫేస్బుక్ లైట్.ఇది స్లో ఇంటర్నెట్ మరియు 2G తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ లో ఫాస్ట్ గా పనిచేసేలా డెవలప్ చేయబడింది.
ఇండియా తో పాటు Philippines లో కూడా లాంచ్ అయిన ఈ యాప్ ను గూగల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. అయితే ఈ లైట్ ఫేస్బుక్ యాప్ లో అన్ని అఫీషియల్ ఫీచర్స్ ఉండవు, కొన్ని ఫీచర్స్ ను తీసివేసింది ఫేస్బుక్. ఫాస్ట్ గా పనిచేసేందుకు మరియు తక్కువ సైజు లో ఉంచేందుకు కొన్నిటిని తొలిగించింది.
ఎక్కువ ఫేస్బుక్ యూజర్స్ ఉన్న మనం దేశానికి ఈ లైట్ యాప్ ను ఫస్ట్ లాంచ్ చేయకుండా ఇతర దేశాలలో రిలీజ్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. దానికి తోడు 2G ఇంటర్నెట్ ను వాడే అతి కొద్ది దేశాలలో ఇండియా ఒకటి.