ఫేస్బుక్ ఈ రోజు 'Moments' అనే యాప్ ను లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐ os ఫోనులకు పనిచేస్తుంది.
దీని ఉపయోగం:
ప్రైవేట్ గా మీ ఫోటోలను క్లౌడ్ స్టోరేజ్ లోకి అప్లోడ్ చేసి ఫేషియల్ రికాగ్నిషన్ ద్వారా ఫ్రెండ్ ట్యాగింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఫేస్బుక్ ఫేస్ రికాగ్నిషణ్ టెక్నాలజీ పై పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్న ఫోటోలో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్లని సింపుల్ గా టాగ్ చేయగలరు. ఒకసారి టాగ్ చేయగానే ఆ ఫోటోలు sync కోసం మీరు టాగ్ చేసిన ఫ్రెండ్స్ కు షేర్ చేసేందుకు సిద్దంగా ఉంటాయి. ఫేస్బుక్, ఇంస్తాగ్రాం లేదా ఫేస్బుక్ మెసెంజర్ లో ప్రైవేట్ గా కూడా వీటినీ వారికీ షేర్ చేయగలరు. మీరు ఫోటో ను తీసిన సమయాన్ని బట్టి గ్రూప్ లు గా ఎరేంజ్ చేస్తుంది మొమెంట్స్.
ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది:
మీరు ఒక పెళ్లికి కాని ఈవెంట్ కాని ఎటేండ్ అయితే, చాలా మంది అనేక డివైజ్ ల నుండి ఫోటోలను తీస్తారు. వాటిలో మీరు ఏ ఫోటోలో ఉన్నా ఫేస్ రికాగ్నిషణ్ టెక్నాలజీ ద్వారా మీరు ఉన్న ఫోటో ప్రైవేట్ గా మీకు షేర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మీరు ఉన్న ఫోటోల కోసం వెతకటం ఒక పని తగ్గితే, వాటిని ట్రాన్సఫర్ చేసుకోవటానికి ఇబందులు పడకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే క్లౌడ్ లో కి షేర్ అయ్యే ఈ ఫోటోలు ఎంత స్టోరేజ్ వరకూ క్లౌడ్ లో సేవ అవుతాయనే దానిపై ఫేస్బుక్ క్లారిటీ ఇవ్వలేదు.
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో Moments యాప్ ఇక్కడ పొందగలరు.
ఐ os యాప్ స్టోర్ లోని Moments యాప్ ఇక్కడ పొందగలరు