నివేదికల ప్రకారం ఫేస్బుక్ దాని మెసెంజర్ ఆప్ లో గేమ్స్ ను జోడించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గేమ్స్ ను జోడించేందుకు బయట డెవలపర్స్ తో చర్చలు కూడా చేస్తుంది.
ఇది ఎప్పుడూ అప్లికేషన్ లోకి రానుంది అనేదాని పై ఇంకా క్లారటీ లేదు కాని ఇతర మెసెంజర్ అప్లికేషన్స్ ఇస్తున్న భారి పోటీ కారణంగా అతి త్వరలోనే గేమ్స్ ప్రాజెక్ట్ లైవ్ లోకి రానుంది. ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్, Ilya Sukar స్వంయంగా దీని డెవలేప్మంట్ పై స్పందించారు.
మేషబల్ ఆర్టికల్ ప్రకారం ఫేస్బుక్ మెసెంజర్ ప్లాట్ఫారం ను థర్డ్ పార్టీ డెవెలపర్లకు ఓపెన్ డెవెలప్మెంట్ కొరకు అవకాశాలు ఇస్తుంది.
గేమింగ్ అనేది నిజంగా మెసెంజర్లలో జోడించడం కొత్తగా ఉంది. ఫేస్బుక్ మెసెంజర్ కు 600 మిలియన్లు కు పైగా యూజర్స్ ఉన్నారు. అయితే ఇప్పటికే మనీ ట్రాన్స్ఫర్, వీడియో చాటింగ్ మరియు వెబ్ చాటింగ్ లతో గత కొన్ని నెలలుగా కొత్త కొత్త ఫీచర్స్ ను తెస్తుంది, కాని యుజర్లను మాత్రం అంతగా ఆకర్షించ లేకపోయింది.
సంబంధిత అభివృద్ధిలో, నివేదికలు ప్రకారం ఫేస్బుక్ దాని ప్రసిద్ధ చాట్ అప్లికేషన్ , WhatsApp వినియోగదారులను బ్రాండ్లు మరియు బిజినెస్ లకు నేరుగా అనుమతించేందుకు ప్రణాళికలు పై పనిచేస్తుంది. The Verge ఆర్టికల్ ప్రకారం ఫేస్బుక్ CEO డేవిడ్ వెనర్ " వాట్స్ అప్ లో త్వరలో కొన్ని ముఖ్య మార్పులు తెచ్చేందుకు యోచిస్తునట్టు వెల్లడించారు. ఆసక్తికరంగా, ఫేస్బుక్ దానియొక్క WhatsApp కు పెద్ద పీట వేస్తుంది.