ఐ os మరియు ఆండ్రాయిడ్ ఫేస్బుక్ మెసెంజర్లలో డూడుల్ డ్రా అనే గేమ్ రిలీజ్ అయ్యింది. ఏదైనా డ్రా చేసి లిమిటెడ్ కలర్స్ ను దానికి వేసి ఫ్రెండ్స్ కు పంపతే, అది ఏంటో అనేది తెలుసు కొని ఆ డూడుల్ మేసేజ్ రిసీవ్ చేసుకున్నన వారు చెప్పాలి. ఇదే దీని కాన్సెప్ట్. ప్లేయర్స్ ఫ్రెండ్స్ ను ఇన్వైట్ చేయటం ద్వారా పాయింట్స్ గెలుచుకొని ఎక్కువ కలర్స్ ను కొనవచ్చు.
అయితే ఫేస్బుక్ మనం ఇంతకముందు చెప్పుకున్నట్టు గానే ఇతర మెసెంజర్ ల నుండి పోటీ ను తట్టుకొవటానికి చాట్ అప్లికేషన్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గత కొంత కాలం గా కొత్త కొత్త ఫీచర్స్ తో వస్తుంది ఫేస్బుక్. కేవలం మెసెంజర్ ఆప్ ద్వారా మరింత ఎక్టివిటి నీ చేసి ఎక్కువ రెవెన్యు ను త్వరలో తెచ్చుకోనుంది ఫేస్బుక్. ప్రస్తుతానికి GIF ఇమేజెస్, సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే మెసెంజర్ ప్లాట్ఫారం పై ఇంతవరకూ కనిపించాయి. ఇక నుండి గేమ్స్ తో కూడా యూజర్స్ ను మరింత ఎంగేజ్ చేయనుంది ఫేస్బుక్.
గేమ్స్ ను డెవలప్ చేసేందుకు డెవలపర్స్ కు సైతం ఓపెన్ ప్లాట్ఫారం చేయనుంది తొందరలో. వీడియో కాలింగ్ నుండి మొదలుకొని, ఫేస్బుక్ పే మెంట్స్ వరకూ ఈ మధ్య కాలంలో మెసెంజర్ లో చాలా మార్పులను తీసుకు వచ్చింది. మొదట్లో మెసెంజర్ ను ఫేస్బుక్ మెయిన్ ఆప్ నుండి సెపరేట్ చేసినప్పుడు యూజర్స్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ను ఇచ్చారు, కాని ఇప్పుడు అలవాటు పడిపోయారు. అయితే మరిన్ని గేమ్స్ ను ఫ్యుచర్ లో ప్రవేసపెట్టి ఫేస్బుక్ యూజర్స్ కు మెసెంజర్ లోనే కొత్త ప్రపంచాన్ని చూపించనుంది.
ఆధారం: TechCrunch