ఫేస్ బుక్ లో మూవీ స్టార్స్ athletes, musicians, పొలిటిషియన్స్ మరియు ఇతర ప్రభావితముచేసేవారి ని లైవ్ స్ట్రిమిమింగ్ విడియోలు పోస్ట్ చేసేందుకు అనుమతి ఇస్తుంది అని వెల్లడించింది.
ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ ఫేస్ బుక్ లోని తమ ఫాలోవర్స్ కు మరింత దగ్గర అయ్యేందుకు ఎప్పటి విషయాలు అప్పుడు తెలియజేయటానికి బాగా ప్రొమొటింగ్ అవుతాయి. లైవ్ వీడియోను స్టార్ట్ చేస్తే చాలు ఫాలోవర్స్ న్యూస్ ఫీడ్ లో కనిపిస్తాది. దానిపై కామెంట్, లైక్ అండ్ షేరింగ్ asusual గా ఉంటాయి. లైవ్ లో ఉంటుండగానే లైవ్ చేసేవారు(పేజ్ owners) కామెంట్స్ కు respond అవగలరు.
మొత్తం లైవ్ వీడియో అయిపోయాక అది పేజ్ లో పోస్ట్ అవుతుంది. అది అవసరం లేకపోతే పేజ్ owners కేవలం లైవ్ broadcast చేసి తరువాత డిలిట్ చేయగలరు. మొదటిగా ఈ లైవ్ స్ట్రిమింగ్ ను Dwayne 'The Rock' జాన్సన్, సెరెనా విలియమ్స్, Luke Bryan, Richard Kaka, Ashley Tisdale, Lester Holt, Martha Stewart మరియు Michael Buble యాక్సిస్ చేయనున్నారు.
లైవ్ బ్రాడ్ కాస్టింగ్ ఇలా చేస్తారు..
ఫేస్ బుక్ దీనితో పాటు జులై లో ఫేస్ బుక్ mentions అని కొత్త ios యాప్ ను రిలీజ్ చేసింది. ఇది ఫేస్ బుక్ ప్లాట్ఫారం లో ఎవరైనా ఎక్కడైనా సెలబ్రిటీస్ ను mention(అంటే ట్యాగ్) చేస్తే celebs నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని వెంటనే కామెంట్ or respond అవటానికి ఈ యాప్ యూజ్ఫుల్ అవుతుంది. Verified ఫేస్ బుక్ పేజ్ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఫేస్ బుక్ mentions మరియు లైవ్ సర్వీస్ కు ఇన్వైట్ చేస్తుంది ఫేస్బుక్.